E-Paper
Advertisement

India vs Oman: చుక్కలు చూపించిన ఒమన్…ఆసియా క‌ప్ లో టీమిండియా హ్యాట్రిక్ విజ‌యాలు

India vs Oman: చుక్కలు చూపించిన ఒమన్…ఆసియా క‌ప్ లో టీమిండియా హ్యాట్రిక్ విజ‌యాలు
Advertisement

India vs Oman: ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా టీమిండియా వ‌ర్సెస్ ఒమ‌న్ ( India vs Oman ) జ‌ట్ల మ‌ధ్య ఇవాళ మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. శుక్ర వారం జ‌రిగిన ఈ మ్యాచ్ లో అంద‌రూ ఊహించిన‌ట్లుగానే విజ‌యం సాధించింది టీమిండియా. దీంతో ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో టీమిండియా హ్యాట్రిక్ విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంది. ఈ మ్యాచ్ 189 ప‌రుగుల టార్గెట్ పెట్టినా కూడా ఒమ‌న్ ప్లేయ‌ర్లు చివ‌రి వ‌ర‌కు పోరాడారు. కానీ చివ‌ర‌లో టీమిండియా బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో… ఒమ‌న్ ఓడింది. ఈ మ్యాచ్ లో  21 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Also Read: Mohammad Nabi 5 Sixes : ఒకే ఓవర్ లో 5 సిక్సర్లు కొట్టిన నబీ… అంతలోనే అతడికి గుండెపోటు… పెను విషాదంలో శ్రీలంక

 

టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Advertisement

 

అబుదాబీలో జ‌రిగిన టీమిండియా వ‌ర్సెస్ ఒమ‌న్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాద‌వ్ సేన విజ‌యం సాధించింది.  ఈ మ్యాచ్ లో 189 పరుగుల టార్గెట్ ను ఒమన్ జట్టు ముందు ఉంచింది సూర్య కుమార్ యాదవ్ సేన. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఒమన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.  ఒకానొక సమయంలో… ఒమన్ మ్యాచ్ గెలుస్తుందని అందరూ భయపడ్డారు. కానీ హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా , అర్ష్ దీప్ సింగ్ ముగ్గురు అద్భుతంగా బౌలింగ్ చివర్లో చేశారు. వరుసగా వికెట్లను తీయడంతో… టీమ్ ఇండియా విజయం సాధించింది. ఒమన్ జట్టులో ఖలీమ్, మిరజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరూ చివరి వరకు… నిలిస్తే ఒమన్ జట్టు విజయం సాధించేది. ఈ మ్యాచ్ లో ఖలీం 64 పరుగులు చేయగా… మీర్జా… 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. కానీ చివరికి… 20 ఓవర్లలో… నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓడిపోయింది  ఒమన్.

Advertisement

 

రాణించిన సంజూ శాంస‌న్‌, బ్యాటింగ్ చేయ‌ని సూర్య‌ కుమార్ యాద‌వ్

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా టీమిండియా వ‌ర్సెస్ ఒమ‌న్ జ‌ట్ల మ‌ధ్య ఇవాళ మ్యాచ్ జ‌రుగ‌గా.. సూర్య కుమార్ యాద‌వ్ జ‌ట్టు అద్భుతంగానే రాణించింది. 200 ల‌కు పైగా ప‌రుగులు చేస్తుంద‌ని అంద‌రూ అనుకుంటే… అక్క‌డి వ‌ర‌కు చేరుకోలేదు టీమిండియా. నిర్ణీత 20 ఓవ‌ర్స్ లో 8 వికెట్లు న‌ష్ట‌పోయి.. 188 ప‌రుగులు మాత్ర‌మే చేసింది టీమిండియా. టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌, కీప‌ర్ సంజూ శాంస‌న్ అద్భుతంగా రాణించ‌డంతో.. టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయ‌గ‌లిగింది. సంజూ శాంస‌న్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీ కూడా పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లో 56 ప‌రుగులు చేసి.. జ‌ట్టును సంజూ ఆదుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు బౌండ‌రీలు సాధించాడు. అటు అభిషేక్ శ‌ర్మ 15 బంతుల్లో 38 ప‌రుగులు చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్ 26 ప‌రుగులు చేయ‌గా.. తిల‌క్ వ‌ర్మ 29 ప‌రుగులు చేసి దుమ్ములేపాడు. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాద‌వ్ బ్యాటింగ్ చేయ‌లేదు.

Also Read: Asia Cup 2025 : పప్పులో కాలు వేసిన రషీద్ ఖాన్… అది ఔట్ రా బాబు అంటూ పరువు తీసిన అంపైర్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×