// // కోచ్ డారెన్ సమీ అబ‌ద్ధాల కోరు....వెస్టిండీస్ ను నాశ‌నం చేస్తున్నాడు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

కోచ్ డారెన్ సమీ అబ‌ద్ధాల కోరు….వెస్టిండీస్ జ‌ట్టును నాశ‌నం చేస్తున్నాడు

కోచ్ డారెన్ సమీ అబ‌ద్ధాల కోరు….వెస్టిండీస్ జ‌ట్టును నాశ‌నం చేస్తున్నాడు
Advertisement

Alzarri Joseph Vs Daren Sammy:  వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్, విక్టరీ అందుకుంది. దీంతో పాకిస్తాన్ తీవ్ర నిరాశకు గురైంది. అయితే సజావుగా ఈ టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టులో జరుగుతున్న అంతర్యుద్ధం బయటపడింది. వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీతో అల్జారీ జోసెఫ్ గొడవకు దిగారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

అల్జారీ జోసఫ్ వర్సెస్ కోచ్ డారెన్ సమీ మధ్య అంతర్యుద్ధం

Advertisement

వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అల్జారీ జోసెఫ్ ను అనవసరంగా గెలికాడు కోచ్ సమి. అల్జారీ జోసఫ్ ను జాతీయ జట్టులోకి తీసుకుంటామని తాము ఆఫర్ ఇచ్చినప్పటికీ… అతడు రిజెక్ట్ చేసినట్లు డారెన్ స‌మీ సంచలన ఆరోపణలు చేశారు. అయితే దానికి కౌంటర్ గా తాజాగా అల్జారీ జోసఫ్ షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టారు. తనకు ఎవరు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని…డారెన్ సమీ ప్రతిదీ అబద్ధమే మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. తాను వెస్టిండీస్ కోసం ప్రాణాలైనా ఇస్తానని వెల్లడించారు. ఇప్పుడు బరిలోకి దిగి ఆడమన్న ఆడతానని వివరించారు. కోచ్ డారెన్ సమీతో గొడవలు ఉన్నప్పటికీ… అతని కోసం కాకుండా వెస్టిండీస్ కోసం తాను ఆడతానని వివరించారు. తన ఆట తాను ఆడుకుంటాను.. డారెన్ సమీ జోలికి వెళ్లబోనని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అసలు సమీ, జోసెఫ్ మధ్య గొడవ ఎక్కడ జ‌రిగింది ?

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్, డారెన్ సమీ మధ్య గొడవ 2024 నవంబర్ 26వ తేదీన జరిగింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ తో మూడవ వన్డే ఆడింది వెస్టిండీస్. అయితే ఆ మూడవ వన్డేలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో కెప్టెన్ షాయ్ హోప్ ఫీల్డర్లను సెట్ చేశాడు. అక్కడితో ఆగకుండా కోచ్ డారెన్ సమీ కూడా డగౌట్ నుంచి ఫీల్డర్లను సెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది అల్జారీ జోసఫ్ కు నచ్చలేదు. దీంతో, తన ఓవర్ ముగిసిన తర్వాత మైదానం నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ నాలుగు ఓవర్ సందర్భంగానే జరిగింది. దీంతో అల్జారీ జోసఫ్ వేయాల్సిన మిగిలిన ఓవర్లన్నీ… వేయించడానికి కెప్టెన్ షాయ్ హోప్ చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ మధ్యలో వెళ్లినందుకు అల్జారీ జోసెఫ్ పై రెండు మ్యాచ్ లు ఆడ‌కుండా బ్యాన్ విధించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డారెన్ సమీ, జోసెఫ్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

Advertisement

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×