E-Paper
Advertisement

Vaibhav Sooryavanshi Biopic: ఇదెక్కడి మాస్ రా మామ..వైభ‌వ్ బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది !

Vaibhav Sooryavanshi Biopic: ఇదెక్కడి మాస్ రా మామ..వైభ‌వ్ బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది !
Advertisement

Vaibhav Sooryavanshi Biopic:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో వరల్డ్ క్లాసు బౌలర్ల తాటతీసి, మొత్తంగా 700 లకు పైగా పరుగులు సాధించాడు. అంతేకాకుండా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో చాలా రికార్డులను నమోదు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 ద్వారా దాదాపు 50 లక్షల ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నాడు. ఇందులో ఒక కారు కూడా ఉంది. దీంతో వైభవ్ సూర్య వంశీ పైన (Vaibhav Sooryavanshi) సోషల్ మీడియాలో అలాగే మాజీ క్రికెటర్లు వివిధ ఫ్లాట్ ఫారాలలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా వైభవ్ గురించే ప్రస్తావించారు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ బయోపిక్ (Vaibhav Sooryavanshi Biopic) రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Tanveer Ahmed: ఆఫ్ఘనిస్తాన్ బౌల‌ర్ల‌కు కోహ్లీ భ‌య‌ప‌డుతున్నాడు..అందుకే గాయం పేరు నాట‌కాలు Tanveer Ahmed! 

వైభవ్ సూర్యవంశీ బయోపిక్ రానుందా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 Tournament) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ బయోపిక్ రానున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో 50 ఏళ్లకు పైగా ఉన్న అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా చేయబోతున్నట్లు కూడా ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. ఇందులో అక్షయ్ కుమార్ అయితే బాగుంటుందని ఇప్పటికి డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఫిబ్రవరి లో వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ బయోపిక్ లో అక్ష‌య్ సెట్ కాడంటూ ట్రోల్స్

అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు తమకు నచ్చిన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ బయోపిక్ ఎవరు తీయబోరని.. ఇదంతా ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా 15 ఏళ్ల బుడ్డోడి బయోపిక్ లో 50 ఏళ్లకు పైగా ఉండే అక్షయ్ కుమార్ ఇలా హీరోగా సెట్ అవుతాడని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఓ యంగ్ హీరోను పెట్టి చేస్తే… సినిమా బంపర్ హిట్ అవుతుందని సూచనలు చేస్తున్నారు. దీంతో వైభవ్ సూర్యవంశీ బయోపిక్ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా అతి త్వరలోనే టీమిండియాలోకి 15 ఏళ్ల వైభవ్ మాత్రం ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్ నేపథ్యంలో అతన్ని ఓపెనర్ గా బరిలోకి దించుతారని చర్చ జరుగుతోంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట.

Advertisement

Also Read: Liam Livingstone: విరాట్ కోహ్లీకి ఇండియాలో ఉండ‌ట‌మే ఇష్టం లేదు
..SRH ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×