E-Paper
Advertisement

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు
Advertisement

Ajinkya Rahane Retirement:  టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు 20 సంవత్సరాలుగా టీమిండియా కు సేవలు అందిస్తున్న అజింక్య రహానే… సరిగ్గా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఈ మేరకు ఎమోషనల్ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. దీంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతని కారణంగానే టీమిండియా క్రికెటర్లు వరుసగా ఇలా రిటైర్మెంట్లు ప్రకటిస్తున్నట్లు దారుణంగా పోస్టులు పెడుతున్నారు. గౌతమ్ గంభీర్ ను హిట్లర్ అంటూ పోల్చుతున్నారు. అతని వల్లే అజింక్య రహానేకు ఈ పరిస్థితి వచ్చిందని అటు వీరేంద్ర సెహ్వాగ్ కూడా పరోక్షంగా చెప్పడం జరిగింది.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

గౌతమ్ గంభీర్ హయాంలో ఐదుగురు రిటైర్మెంట్లు

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ దాదాపు రెండు సంవత్సరాల కిందట బాధ్యతలు తీసుకున్నాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత… టీమిండియాలో సమూల మార్పులు జరుగుతున్నాయి. పాత ప్లేయర్లను పక్కకు పెట్టడం, కొత్త ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ లాంటి జట్లకు సంబంధించిన ప్లేయర్లను మాత్రమే టీమిండియాలోకి తీసుకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.

అలాగే పెచ్చుల్లో అద్భుతంగా రాణించిన చాలామంది క్రికెటర్లకు గౌతమ్ గంభీర్ అవకాశం ఇవ్వలేదు. ఇతని హయాంలోనే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశారు. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకనే… రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అశ్విన్ కూడా వెల్లడించారు. ఆ తర్వాత టీమిండియా కు రాహుల్ ద్రావిడ్ తర్వాత ది గ్రేట్ వాల్ అనిపించుకున్న పూజార కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. టీమిండియాలో అవకాశాలు వస్తాయని చాలా రోజులు ఎదురు చూసి, చేసేదేమీ లేక తప్పుకున్నాడు. నేడు అజింక్య రహానే కూడా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక మిగిలింది ఆ ఒక్కడే

Advertisement

గౌతమ్ గంభీర్ హయాంలో దాదాపు ఐదుగురు పెద్ద క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇక ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ ప్లేయర్ గా ఉన్న రవీంద్ర జడేజా ఒక్కడే రిటైర్మెంట్ ఇవ్వకుండా జట్టులో కొనసాగుతున్నాడు. గంభీర్ వచ్చాక అతడికి కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పటికే వన్డేల నుంచి అతని తప్పిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆడేది కూడా డౌటే. టెస్టుల్లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు రవీంద్ర జడేజా. వాషింగ్టన్ సుందర్ , శివం దుబే, షెగ్డే లాంటి అనుభవం లేని వాళ్లకు అవకాశాలు ఇస్తూ… రవీంద్ర జడేజాను పక్కకు పెడుతున్నాడు గంభీర్. ఈ క్రమంలో జడేగా కూడా రిటైర్మెంట్ ఇస్తాడని చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ తర్వాత రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×