E-Paper
Advertisement

Aiden Markram: రెండు చెంపల‌పైన‌ చెల్లుమనేలా కొట్టారు..సెమీస్ ఓట‌మిపై మార్క్‌రమ్ క‌న్నీళ్లు !

Aiden Markram: రెండు చెంపల‌పైన‌ చెల్లుమనేలా కొట్టారు..సెమీస్ ఓట‌మిపై మార్క్‌రమ్ క‌న్నీళ్లు !
Advertisement

Aiden Markram:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) దక్షిణాఫ్రికా కథ ముగిసింది. అందరూ ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా దరిద్రం మరోసారి తెరపైకి వచ్చింది. 2024 టి20 ప్రపంచ కప్ సమయంలో ఇండియా చేతిలో ఫైనల్స్ ఓడిపోయిన దక్షిణాఫ్రికా… ఈసారి సెమీఫైనల్ దాకా వచ్చి మ్యాచ్ చేజార్చుకుంది. ఈ టోర్నమెంట్లో ఒక్క ఓటమి కూడా ఎరగని దక్షిణాఫ్రికా, కీలకమైన సెమీ ఫైనల్ లో మాత్రం ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ ఫైనల్ కు వెళ్లగా దక్షిణాఫ్రికా మాత్రం ఇంటిదారి పట్టింది. ఈ త‌రుణంలోనే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram) ఎమోష‌న‌ల్ అయ్యారు.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

సెమీఫైనల్ ఓటమిపై ఐడెన్ మార్క్‌రమ్ ఎమోషనల్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో సెమీ ఫైనల్స్ లో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మామూలు ఓటమి కాదని.. అత్యంత ఘోరంగా ఓడిపోయామని ఒప్పుకున్నాడు. కళ్ళు మూసి తెరిచే లోపు మ్యాచ్ ఫినిష్ చేశారని న్యూజిలాండ్ బ్యాటర్ లను మెచ్చుకున్నారు ఐడెన్ మార్క్‌రమ్. తమ రెండు చెంపలు చెల్లుమనేలా న్యూజిలాండ్ ప్లేయర్లు దెబ్బ కొట్టారని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దెబ్బ కొడితే తీసుకున్నాం.. నెక్స్ట్ చాలా బలంగా వస్తామని ఛాలెంజ్ చేశారు ఐడెన్ మార్క్‌రమ్. తమ ఓటమిని అలెన్ ఫిన్ ఒక్కడే శాసించాడని తెలిపారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తమకు ఎక్కువ పరుగులు రాలేదని.. అదే మా కొంప ముంచిందని వెల్లడించారు. తమది సెకండ్ బ్యాటింగ్ అయితే ఫైనల్స్ కు చేరుకునే వాళ్ళమని పేర్కొన్నాడు. దీంతో ఐడెన్ మార్క్‌రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

దక్షిణాఫ్రికాను వెంటాడుతున్న ఆ దరిద్రం

దక్షిణాఫ్రికా జట్టును దరిద్రం మళ్ళీ వెంటాడుతూనే ఉంది. మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన దక్షిణాఫ్రికా, ఈసారి ఎలాగైనా టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే వరుస విజయాలతో దూసుకు వెళ్ళింది దక్షిణాఫ్రికా. కానీ దురదృష్టవశాత్తు సెమీ ఫైనల్ దశలోనే ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. అయితే ఇలాంటి సంఘటన దక్షిణాఫ్రికాకు కొత్తేమీ కాదు. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో సెమీ ఫైనల్ లాగా వెళ్ళిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక 2024 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంటు ఫైనల్స్ లో ఇండియా చేతిలో దక్షిణాఫ్రికా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో మరోసారి ఓడిపోయింది. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ లో మరోసారి న్యూజిలాండ్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో దారుణ ఓటమి చవి చూసింది. ఇలా కీలక స్టేజీలలో దక్షిణాఫ్రికా ఓడిపోతూ ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చుతోంది

Advertisement

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×