E-Paper
Advertisement

టీమిండియా ప్లేయ‌ర్ల‌కు మూడు లైఫ్ లు..రివ్యూలు తీసుకోకుండా నిద్ర‌పోతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్లు

టీమిండియా ప్లేయ‌ర్ల‌కు మూడు లైఫ్ లు..రివ్యూలు తీసుకోకుండా నిద్ర‌పోతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్లు
Advertisement

IND vs AFG:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో వెంటనే అంతర్జాతీయ క్రికెట్ పైన దృష్టి పెట్టింది టీమిండియా. ఇందులో భాగంగానే టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan, One-off Test) మధ్య వన్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. న్యూ చండీగఢ్ (Mullanpur, New Chandigarh) వేదికగా ఈ రెండు జట్ల మధ్య నిన్న ఏకైక టెస్ట్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. ఇప్పటికే 560 కి పైగా పరుగులు సాధించిన టీమిండియా.. ఆఫ్ఘానిస్తాన్ ముందు కొండంత టార్గెట్ పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇతర ప్లేయర్లపై దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు నిద్రపోయిన నేపథ్యంలో…టీమిండియాకు మూడు లైఫ్ లు వచ్చాయని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

టీమిండియాకు మూడు లైఫ్ లు…నిద్ర‌పోతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్లు

Advertisement

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ నేపథ్యంలో మన గిల్ సేనకు మూడు లైఫులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (Hashmatullah Shahidi) నిర్లక్ష్యం, ఆ జట్టు ప్లేయర్ల లేజీ తనం వల్ల… టీమిండియా జట్టుకు మూడు లైఫ్లు దక్కాయి. కె ఎల్ రాహుల్ మొదటి రోజు మ్యాచ్ ప్రారంభం కాగానే ఔట్ అయ్యేవాడు. తన బ్యాటుకు తగిలి వికెట్ కీపర్ చేతుల్లోకి బంతి వెళ్ళింది. అయినప్పటికీ వికెట్ కీపర్ గానీ… ఇటు కెప్టెన్ రివ్యూ తీసుకోలేదు. నిద్రపోయినట్లుగా వ్యవహరించారు. ఇక మంచి లైఫ్ వచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రాహుల్ బ్యాట్ కు బంతి తగలనట్టే.. యాక్టింగ్ చేసి ఆస్కార్ అవార్డు అందుకున్నాడని కామెంటేట‌ర్లు కూడా ర్యాగింగ్ చేశారు.

అటు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక క్లియర్ ఎడ్జ్ స్పష్టంగా దొరికింది. అప్పుడు వికెట్ కీపర్ అప్స‌ర్ జజాయ్ అప్పీల్ చేయకపోవడంతో.. మరో లైఫ్ దక్కింది. ఫలితంగా రిషబ్ పంత్ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 81 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఇక రెండో రోజు అజ్మతుల్లా ఒమర్ జాయ్ (Azmatullah Omarzai.) వేసిన ఓ బంతి గిల్ ( Shubman Gill) ప్యాడ్ లకు బలంగా తగిలింది. అప్పుడు అంపైర్ నాటౌట్ అని ఇచ్చాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ రివ్యూ కూడా తీసుకోలేదు. రిప్లై లో గిల్ ఔట్ అని తేలింది. ఇలా మొత్తం మూడు లైఫ్ లు వచ్చాయి. ఈ క్రమంలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 564 పరుగుల వద్ద ఎనిమిది వికెట్లు నష్టపోయిన టీమిండియా డిక్లేర్ కూడా చేసింది.

Advertisement

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×