E-Paper
Advertisement

AFG vs UGA T20 World Cup 2024 Highlights: ఆఫ్గాన్ గెలుపు.. ఉగాండ 58 పరుగలకి ఆలౌట్

AFG vs UGA T20 World Cup 2024 Highlights: ఆఫ్గాన్ గెలుపు.. ఉగాండ 58 పరుగలకి ఆలౌట్
Advertisement

మొదట టాస్ గెలిచిన ఉగండా బౌలింగు తీసుకుంది. దీంతో ఆఫ్గనిస్తాన్ బ్యాటింగుకి వచ్చి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఉగండా 16 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Advertisement

వివరాల్లోకి వెళితే.. 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగు ప్రారంభించిన ఉగండా ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. నలుగురు డక్ అవుట్లు అయ్యారు. రియాజత్ ఆలి షా (11), రాబిన్ సన్ ఒబుయా (14) ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మొత్తానికి 16 ఓవర్లలో 58 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

Also Read: న్యూయార్క్ పిచ్ పై.. పడుతూ లేస్తూ గెలిచిన సౌతాఫ్రికా

Advertisement

ఆఫ్గనిస్తాన్ బౌలింగులో ఫజల్లాఖ్ ఫరూఖి 5, ముజీబ్ 1, నవీన్ ఉల్ హక్ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ ఓపెనర్లు ఇద్దరూ అదరగొట్టారు. వారే మొత్తం స్కోరు చేశారు. రహమనుల్లా గుర్భాజ్  45 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 76 చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ 46 బంతుల్లో 1 సిక్సర్, 9 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన  నజీబుల్లా జర్దాన్ (2), ఒమర్ జాయ్ (5)  స్కోరు పెంచే క్రమంలో అవుట్ అయ్యారు. మహ్మద్ నబీ (14 నాటౌట్) గా నిలిచాడు. ఓవరాల్ గా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

ఉగండా బౌలింగులో అల్పేష్ రంజానీ 1, కాస్మోస్ 2, బ్రైన్ మసాబా 2 వికెట్లు తీశారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×