E-Paper
Advertisement

Accident on the Racing Track : రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదం.. 18 ఏళ్ల రేసర్ మృతి..

Accident on the Racing Track : రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదం.. 18 ఏళ్ల రేసర్ మృతి..
Advertisement
Accident on the Racing Track

Accident on the Racing Track : స్పోర్ట్స్ అనేవి అప్పుడప్పుడు ఎంతో ప్రమాదకరంగా మారుతాయి. మామూలుగా స్పోర్ట్స్‌లో చిన్న చిన్న గాయాలు సహజం. సహజంగా పెద్ద ప్రమాదాలు జరగకుండా అథారిటీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినా కూడా మృత్యువు అనేది ఎటు నుండి ఎలా సంభవిస్తుందో చెప్పలేం. తాజాగా రేసింగ్ హిస్టరీలో జరిగిన ప్రమాదాల్లో మరొకటి యాడ్ అయ్యింది. ఈ ప్రమాదంలో యంగ్ రేసర్ మృతిచెందడం అందరినీ కలచివేసింది.

Advertisement

ప్రస్తుతం స్పా ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్‌లో ఫార్ములా రీజియనల్ యూరోపియన్ ఛాంపియన్‌షిప్ జరుగుతున్నాయి. ఆ ఫైనల్ రేస్‌లో జరిగిన ప్రమాదంలో యంగ్ రేసర్ డిలానో వాంట్ హాఫ్ మృతి చెందాడు. డిలానో వయసు 18 ఏళ్లే. ప్రమాదం జరిగిన తర్వాత రేసును నిలిపివేశారు. ట్రాక్‌పై జరిగిన ప్రమాదంలోనే డిలానో కన్నుమూసినట్టు ఛాంపియన్‌షిప్ అథారిటీ ప్రకటించింది. తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఎమ్‌పీ మోటర్‌స్పోర్ట్స్ అనే టీమ్ ద్వారా ఇప్పటికే పలు రేసింగ్ పోటీలలో పాల్గొన్నాడు డిలానో. 2021లో మోటర్ స్పోర్ట్‌లో డెబ్యూ చేసినప్పటి నుండి డిలానో.. ఎమ్‌పీతోనే ప్రయాణాన్ని కొనసాగించాడు. డిలానో తమ టీమ్‌కు ఎంతో ఎనర్జీని తీసుకొచ్చాడని, అలాంటి రేసర్ ఇలా హఠాన్మరణం చెందడం బాధగా ఉందని ఎమ్‌పీ మోటర్ స్పోర్ట్స్ యాజమాన్యం తెలిపింది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో డిలానో మృతికి ఫార్ములా 1, ఫియా సంతాపం తెలియజేశాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×