E-Paper
Advertisement

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?
Advertisement

IND Vs SL :   ఆసియా క‌ప్ 2025 లో భాగంగా ఇవాళ సూప‌ర్ 4 చివ‌రి మ్యాచ్ టీమిండియా వ‌ర్సెస్ శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 202 ప‌రుగులు చేసింది. శ్రీలంక జ‌ట్టు బౌల‌ర్ల‌లో తీక్ష‌ణ బౌలింగ్ లో శుబ్ మ‌న్ గిల్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. తీక్ష‌ణ బౌలింగ్ వేసి.. తానే క్యాచ్ అందుకోవ‌డంతో ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు గిల్. ఇక అభిషేక్ శ‌ర్మ మాత్రం వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సిక్స్, ఫోర్ల‌తో స్కోర్ బోర్డును ప‌రుగెత్తించాడు. 31 బంతుల్లో 61 ప‌రుగులు చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్స్ లు బాదాడు అభిషేక్.

Also Read :  Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే !

రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్..

Advertisement

దీంతో అభిషేక్ శ‌ర్మ ఇవాళ శ్రీలంక తో జ‌రిగిన మ్యాచ్ లో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. టీ-20 ఆసియా క‌ప్ లో ఒక ఏడాది ఎక్కువ ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రిజ్వాన్ 281 పేరిట ఉన్న రికార్డు ను బ్రేక్ చేశాడు అభిషేక్ శ‌ర్మ‌. టీమిండియా త‌ర‌పున ఒకే టోర్నీలో 300+ ర‌న్స్ చేసిన తొలి ఆట‌గాడిగా 309 నాటౌట్ గా నిలిచాడు. అలాగే త‌క్కువ బంతుల్లో 50 చేసిన ప్లేయ‌ర్ల‌లో రోహిత్ 6 సార్లు, రికార్డును స‌మం చేశాడు. వ‌రుసగా ఎక్కువ సార్లు 30 + స్కోర్ చేసిన రిజ్వాన్, రోహిత్ శ‌ర్మ (7) స‌ర‌స‌న చేరాడు. ఇక కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ 13 బంతుల్లో 12 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్ కీల‌కంగా ఆడారు. కానీ సంజూ శాంస‌న్ కేవ‌లం 39 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ కాగా.. తిల‌క్ వ‌ర్మ మాత్రం హాఫ్ సెంచ‌రీ కి చేరువ‌య్యాడు. కానీ హాఫ్ సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు. 49 ప‌రుగులు నాటౌట్ గా నిలిచాడు.  సంజూ శాంస‌న్ ఔట్ కాగానే.. క్రీజులోకి వ‌చ్చిన హార్దిక్ పాండ్యా ఎక్కువ‌సేపు క్రీజులో కుదురుకోలేక‌పోయాడు. 3 బంతుల్లో కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి చ‌మీరా బౌలింగ్ లో అత‌నికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హార్దిక్ పాండ్యా. ఆ త‌రువాత వ‌చ్చిన అక్ష‌ర్ ప‌టేల్ చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉన్నాడు.

Also Read : Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

హాఫ్ సెంచ‌రీ మిస్..

Advertisement

ఇక శ్రీలంక బౌల‌ర్ల‌లో తీక్ష‌ణ 1, చ‌మీర 1, హ‌స‌రంగ 1, శ‌న‌క 1, అస‌లంక 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు. దీంతో భార‌త్ 202  ప‌రుగులు చేసింది. శ్రీలంక టార్గెట్ 203 ప‌రుగులు. వాస్త‌వానికి తిల‌క్ వ‌ర్మ హాఫ్ సెంచ‌రీ చేస్తాడ‌ని అంతా భావించారు. కానీ చివ‌రి రెండు బంతులు కూడా అక్ష‌ర్ ప‌టేల్ ఆడ‌టంతో తిల‌క్ వ‌ర్మ కి ఛాన్స్ రాలేదు. దీంతో 49 ప‌రుగుల‌తో మాత్ర‌మే స‌రిపెట్టుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో తిల‌క్ వ‌ర్మ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్, తిల‌క్ వ‌ర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడ‌టంతో భార‌త్ 202 ప‌రుగులు చేయ‌గ‌లిగింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×