E-Paper
Advertisement

Kamran Akmal: అభిషేక్ మ‌నిషా? రాక్ష‌సుడా ? వాడిని వ‌దిలితే 500 కూడా కొట్టేస్తాడురా

Kamran Akmal: అభిషేక్ మ‌నిషా? రాక్ష‌సుడా ? వాడిని వ‌దిలితే 500 కూడా కొట్టేస్తాడురా
Advertisement

Kamran Akmal:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం రోజున మూడవ టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). 14 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు… అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై స్పందిస్తున్నారు. అటు పాకిస్తాన్ ( Pakistan) మాజీ క్రికెటర్లు కూడా తెగ పొగిడేస్తున్నారు. తాజాగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ) స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆటగాడికి అభిషేక్ శర్మ తయారయ్యాడని వెల్లడించారు. వీడిని ఇలాగే వదిలేస్తే వన్డేల్లో ఒక్కడే 500 పరుగులు కొట్టే ప్రమాదం ఉందని వార్నింగ్ కూడా ఇచ్చాడు క‌మ్రాన్ అక్మ‌ల్.

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

అభిషేక్ శర్మను వదిలేస్తే 500 పరుగులు కూడా కొడతాడు

Advertisement

న్యూజిలాండ్ పై 14 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్పందించారు. టీమిండియాకు మరో సచిన్ టెండూల్కర్ లాగా అభిషేక్ శర్మ తయారవుతాడని వెల్లడించారు. ప్రమాదకరంగా ఇప్పుడిప్పుడే మారిపోతున్నాడని అభిషేక్ శర్మపై కామెంట్ చేశారు కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ). ఫ్యూచర్ లో వన్డే క్రికెట్ లో అతడు అడుగుపెడతాడని.. ఆ సమయంలో కచ్చితంగా ఒక్కడే 500 పరుగులు చేయగలుగుతాడని కూడా అంచనా వేశారు. అభిషేక్ శర్మను ఆపడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. న్యూజిలాండ్ లాంటి భయంకరమైన బౌలర్లకు చుక్కలు చూపించాడని… ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ ఆడే ప్రతి జట్టు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ). అభిషేక్ శర్మ షాట్స్ ఆడే సెలక్షన్స్ అద్భుతంగా ఉందని.. ఫుల్ కాన్ఫిడెన్స్ తో బ్యాటింగ్ చేస్తాడని వివరించారు. భవిష్యత్తు అభిషేక్ శర్మ అదే అని కొనియాడారు.

పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌

న్యూజిలాండ్ పై టీమిండియా 10 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్‌. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( T20 World Cup 2026 Tournament ) ఆడే పాకిస్తాన్ ఒక్క‌సారి ఆలోచ‌న చేసుకోవాల‌ని సూచ‌న‌లు చేశారు. ఒక‌వేళ తెగించి, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ఆడితే మాత్రం కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ( Chennai) ప‌డ‌తార‌ని హెచ్చ‌రించాడు. ఇక‌నైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ఆడే ముందు పాకిస్తాన్ ఆలోచ‌న చేసుకోవాల‌ని తెలిపారు. ఆడక‌పోతేనే పాకిస్తాన్ బ‌తికి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చుర‌క‌లు అంటించారు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్‌.

Advertisement

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×