E-Paper
Advertisement

Abhishek Sharma Tattoo: అభిషేక్‌ శర్మ కొత్త టాటూ.. 10 గంటల్లోనే దాదాపు లక్ష లైక్‌లు

Abhishek Sharma Tattoo: అభిషేక్‌ శర్మ కొత్త టాటూ.. 10 గంటల్లోనే దాదాపు లక్ష లైక్‌లు
Advertisement

Abhishek Sharma Tattoo: భారత క్రికెట్ లో యువ సంచలనంగా మారిన ఓపెనర్ అభిషేక్ శర్మ తన అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టి-20 లలో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు అభిషేక్ శర్మ. అతడి ఖాతాలో 925 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్ 2025 లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అలాగే ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Also Read: SL vs PAK 2025: చేత‌కానీ దద్ద‌మ్మ‌లు…ఇండియాపై గెలవ‌డం చేత‌కాదు, కానీ శ్రీలంక చీల్చిచెండాడిన పాక్‌

Advertisement

తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు టి-20 సిరీస్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు అభిషేక్ శర్మ. టీం ఇండియా 2-1 తో ఈ సిరీస్ ని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో కేవలం 528 బంతుల్లో 1000 టి-20 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసి.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా { బంతుల పరంగా} ఆ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్ గా రానించిన అభిషేక్ శర్మ.. అప్పటినుండి టీమ్ ఇండియాలో స్థానం సంపాదించుకొని మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.

అభిషేక్ శర్మ కొత్త టాటూ వైరల్:

మైదానంలో నిప్పులు చెరిగే ఇన్నింగ్స్ లు ఆడే అభిషేక్ శర్మ.. తన ఆటతోనే కాకుండా తాజాగా తన స్టైల్ తోను వార్తల్లో నిలిచాడు. తన కొత్త టాటూ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు. అభిషేక్ శర్మ తన చేతిపై టాటూ వేయించుకున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. తన కుడి చేతి మణికట్టుపై “it will happen” {అది జరుగుతుంది} అని రాసి ఉన్న ఈ టాటూ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ పోస్ట్ దాదాపు 10 గంటల్లోనే లక్ష లైకులు సంపాదించింది. ఈ క్రమంలో అతడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తన దూకుడైన ఆట తీరుతో భారీ లక్ష్యాలను సైతం చేదించగలననే ఆత్మవిశ్వాసానికి ఈ టాటూ నిదర్శనమని క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అభిషేక్ శర్మ సీక్రెట్:

Advertisement

తాజాగా అభిషేక్ శర్మ గురువు యువరాజ్ సింగ్ తన శిష్యుడికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టి నవ్వులు పూయించాడు. ఓ కార్యక్రమంలో యువరాజ్ సింగ్ తన శిష్యుడు అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతూ.. “అభిషేక్ తన్నులైన తింటాడు, ఏడుస్తాడు.. కానీ తన బ్యాట్ ని మాత్రం ఎవరికీ ఇవ్వడు. అతడి దగ్గర నుంచి మీరు ఏమైనా తీసుకోండి. కానీ బ్యాట్ ని మాత్రం తీసుకోలేరు. దానికోసం వాడు కొట్లాడుతాడు, ఏడుస్తాడు. కానీ బ్యాట్ మాత్రం ఎవరికీ ఇవ్వడు.

Also Read: BCCI: నోరు మూసుకుని, మేం చెప్పిన‌ట్లే ఆడాలి.. కోహ్లీ, రోహిత్ ప‌రువు తీసిన బీసీసీఐ

తన కిట్ బ్యాగులో రెండు, మూడు బ్యాట్లు ఉన్నప్పటికీ.. తన దగ్గర రెండు బ్యాట్లు మాత్రమే ఉన్నాయని అబద్ధం చెబుతాడు” అని తెలిపాడు యువరాజ్ సింగ్. అయితే యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో పక్కనే ఉన్న అభిషేక్ శర్మ సిగ్గుతో చిరునవ్వు నవ్వాడు. అభిషేక్ శర్మ తన క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో యువరాజ్ సింగ్ దగ్గర శిక్షణ పొందిన విషయం తెలిసిందే. యువరాజ్ మార్గదర్శకత్వంలోనే అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటర్ గా మారాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×