E-Paper
Advertisement

Rcb-Ms Dhoni: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!

Rcb-Ms Dhoni: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!
Advertisement

Rcb-Ms Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీకి అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరడం ఏమో కానీ… చెన్నై సూపర్ కింగ్స్ అలాగే మహేంద్ర సింగ్ ధోనీనీ టార్గెట్ చేసి…RCB అభిమానులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేలా… పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం, స్టేడియంలో ప్లకార్డులు చూపించడం, రెండు ఏళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించాలంటే… మహేంద్రసింగ్ ధోని ఉద్దేశించి జెర్సీలను తయారు చేయడం లాంటివి చేసి… కొత్త ట్రోలింగ్ తెర లేపారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.

Also Read: Sanjiv Goenka : 27 కోట్లు బొక్క… చేసేదేమీ లేక పంత్ కు మసాజ్ చేస్తున్న లక్నో ఓనర్

Advertisement

చీటర్ ధోని… పిక్చర్ ధోని అంటూ ట్రోలింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో భాగంగా మంగళవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన రాజస్థాన్ రాయల్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన బెంగళూరు అభిమానులు… ధోనిని టార్గెట్ చేసి మళ్ళీ ట్రోల్ చేశారు. ఓ వ్యక్తి అయితే.. మహేంద్ర సింగ్ ధోని పెద్ద పిక్చర్ అంటూ ప్ల కార్డు చూపించాడు. స్టంపింగ్ నుంచి సిక్సర్ల వరకు అంతా ఫిక్సింగ్ అంటూ… స్టేడియంలో రచ్చ చేశాడు బెంగళూరు అభిమాని. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

బెంగళూరు పై చెన్నై అభిమానులు ఫైర్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై అనవసరంగా పోస్టులు అలాగే కామెంట్లు పెడుతున్న బెంగళూరు అభిమానులకు చెన్నై ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒక కప్పు కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కొంచెం కూడా సిగ్గు లేదని చురకలు అంటిస్తున్నారు. దమ్ముంటే.. కప్పు గెలిచి చూపించాలని… సవాలు విసురుతున్నారు మహేంద్రసింగ్ ధోని అభిమానులు. ఐదు టోర్నమెంటులు తీసుకువచ్చిన మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడే హక్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఏమాత్రం లేదని ఫైర్ అవుతున్నారు.

Also Read: Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా

ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమైన చెన్నై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత దారుణంగా విఫలమవుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన మొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇందులో మూడు మాత్రమే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్… 10 మ్యాచ్ లలో ఓడిపోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా బ్యాటింగ్లో పెద్దగా రాణించడం లేదు. ఈ తరుణంలోనే బెంగుళూరు అభిమానులు రెచ్చిపోతున్నారు.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×