E-Paper
Advertisement

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు తీవ్ర గాయం..ర‌క్తం వ‌చ్చినా బ్యాటింగ్‌, శ్రేయాస్ ను బండబూతులు తిడుతూ !

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు తీవ్ర గాయం..ర‌క్తం వ‌చ్చినా బ్యాటింగ్‌, శ్రేయాస్ ను బండబూతులు తిడుతూ !
Advertisement

Rohit Sharma: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI ) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య అడిలైడ్ ( Adelaide Oval, Adelaide) వేదికగా ఇవాళ రెండో వన్డే జరుగుతోంది. అయితే ఇందులో మంచి టచ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ( Rohit Sharma ), గాయం చేసుకున్నాడు. అనవసరంగా పరుగుకు వెళ్లి, రనౌట్ కాకుండా కాపాడుకునేందుకు డైవ్ చేశాడు. ఈ సందర్భంగా అతని మోచేతికి తీవ్రమైన గాయమైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు బ్లీడింగ్ కూడా అయింది. బ్లీడింగ్ జరిగినా కూడా ఏమాత్రం తగ్గకుండా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ డైవింగ్ చేసి రనౌట్ కాకుండా కాపాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో అతనికి గాయం కూడా కావడం అతని అభిమానులను కలవర పెడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో 97 బంతులో 73 పరుగులతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

Also Read: Shubman Gill: వివాదంలో శుభమాన్ గిల్.. “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ రెచ్చిపోయిన ఫ్యాన్‌..షేక్ హ్యాండ్ ఇచ్చి మ‌రీ !

శ్రేయాస్ ను బండబూతులు తిట్టిన రోహిత్ శ‌ర్మ‌

Advertisement

ఇవాళ జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ చాలా సీరియస్ గా కనిపించాడు. దానికి తగ్గట్టుగానే ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరుగు కోసం ప్రయత్నించిన రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ పై చాలా సీరియస్ అయ్యాడు. ఏడు ఓవ‌ర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను…. శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ ఆదుకున్నారు. అప్పటికే రెండు వికెట్లు పోయిన నేపథ్యంలో సింగిల్స్ కోసం రోహిత్ శర్మ ప్రయత్నిస్తున్నాడు.

అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం సింగిల్ కోసం రాలేదు. దీంతో వెంటనే హిందీలో బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఏడు ఓవర్లు పూర్తయ్యాయి.. సింగిల్స్ అయినా తీయాలి మనం.. నేను సింగిల్ తీస్తామంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావ్? అంటూ సీరియస్ అయ్యాడు రోహిత్ శర్మ. అయితే నువ్వు సింగిల్ కి వస్తే నేను రానా ? నువ్వు రాలేదని నేను రాలేదు అంటూ శ్రేయస్ అయ్యర్ రిప్లై ఇచ్చాడు. నేను ప్రతి దాన్ని నీకు చెప్పాలా అంటూ మళ్ళీ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

17 ఏళ్ల తర్వాత ఓడిపోయిన టీమ్ ఇండియా

Advertisement

అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ రెండో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి వరకు పోరాడిన టీమిండియా ఓడిపోయి, ఆస్ట్రేలియా సిరీస్ కూడా కోల్పోయింది. 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అయితే, అడిలైడ్ వేదిక‌గా 9 మ్యాచ్ లు ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచింది టీమిండియా. 17 ఏళ్లుగా టీమిండియా.. ఈ వేదిక‌పై విజ‌యం సాధించింది. కానీ ఈ సారి మాత్రం ఓడిపోయింది టీమిండియా.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×