// // WTC 2027: WTC 2027: WTCలో ఇక‌పై 12 జ‌ట్లు...వ‌న్డే సూప‌ర్ లీగ్ -->
E-Paper
Advertisement

WTC 2027: WTCలో ఇక‌పై 12 జ‌ట్లు…వ‌న్డే సూప‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది..ఇక ఆ పద్ధతికి ఫుల్‌స్టాప్‌

WTC 2027: WTCలో ఇక‌పై 12 జ‌ట్లు…వ‌న్డే సూప‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది..ఇక ఆ పద్ధతికి ఫుల్‌స్టాప్‌
Advertisement

WTC 2027:  ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ( World Test Championship) టోర్నమెంట్లో కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మొన్నటి వరకు ఉన్న తొమ్మిది జట్లను కాస్త పెంచేందుకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇకపై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో 12 జట్లు పాల్గొంటాయని స‌మాచారం అందుతోంది. 2027 నుంచి 2029 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఈ రూల్ అమల్లోకి వస్తుంది. త్వరలోనే ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

WTC లో ఇకపై 12 జట్లు ఛాన్స్‌..ఐసీసీ సంచ‌ల‌నం !

Advertisement

ప్రతి జట్టుకు అవకాశం రావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఐసీసీ సంచలన‌ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో ( World Test Championship) ఇకపై 12 జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వచ్చేలా అవకాశం కల్పిస్తోంది. కొత్తగా ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ తో పాటు జింబాబ్వేకు ఛాన్స్ రాబోతుందట. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్ అలాగే బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే ఈ టోర్నమెంట్ ఆడుతున్నాయి. టు టైర్ విధానం వల్ల పెద్దగా ప్రయోజనం దక్కకపోవడం కారణంగా ఆ రూల్‌ రద్దు చేయ‌నుంద‌ట‌ ఐసిసి. దీంతో 12 జట్లు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ప్రాతినిధ్యం వహిస్తాయి. అన్ని జట్లకు సమాన హక్కులు కలుగుతాయి. పాయింట్ల ప్రకారం ఆయా జట్లు ఫైనల్ కు చేరుతాయి.

వ‌న్డే సూప‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది

ఐసీసీ పురుషుల క్రికెట్ లో వ‌న్డే సూపర్ లీగ్ ( ODI SUPER LEAGUE ) మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే క్రికెట్ కు ఊపిరి పోసేందుకు ఐసీసీగా అడుగులు వేస్తోందట. వన్డే సూపర్ లీగ్ ద్వారానే 2023 వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు జట్లు అర్హత సాధించాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు దాన్ని రద్దుచేసి, ఇప్పుడు పునః ప్రారంభించే దిశగా ఐసిసి అడుగులు వేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దిన దినం వన్డేలను చూసేవారి సంఖ్య అమాంతం తగ్గిపోతుంది. అందుకే మళ్లీ వన్డేలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వన్డే సూపర్ లీగ్ ను పునరుద్ధరణ చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తోందట.

Advertisement

ఈ రూల్ అమల్లోకి వస్తే, ఈ టోర్నమెంట్ లో మొత్తం 13 జట్లు పాల్గొంటాయి. ఇందులో 12 పూర్తిస్థాయి సభ్య దేశాలతో పాటు నెద‌ర్లాండ్స్‌ కూడా ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్ 7 స్థానంలో ఉన్న అన్ని జట్లు ప్రపంచకప్ 2027కు అర్హత సాధిస్తాయి. మిగిలిన 5 జట్లు వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ చివరి రెండు స్థానాల కోసం పోటీ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ఒక్క విజయానికి ప్రతి జట్టుకు 10 పాయింట్లు దక్కుతాయి. ఒకవేళ మ్యాచ్ రద్దు లేదా డ్రాగా అయితే 5 పాయింట్లు రెండు జ‌ట్ల‌కు లభిస్తాయి. ఓడిపోతే ఒక్క‌ పాయింట్ కూడా రాదు. అలా పాయింట్లు, ర్యాంకింగ్స్ ద్వారా 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు సంబంధించిన జ‌ట్లు ఫైనల్ చేయబోతున్నారని సమాచారం.

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×