E-Paper
Advertisement

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!
Advertisement

Portronics Pure Sound Pro X2: సౌండ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా.. అందుబాటు ధరలో మంచి ఆడియో సిస్టమ్ కోసం చూసే వారికి పోర్ట్రానిక్స్ మంచి ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది. ‘పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2’ పేరుతో కొత్త 5.1 ఛానెల్ హోమ్ థియేటర్ సిస్టమ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన సౌండ్, మోడరన్ డిజైన్‌తో వచ్చిన ఈ డివైజ్ ఇంట్లోనే థియేటర్ అనుభూతిని అందిస్తుంది.

ఈ హోమ్ థియేటర్ అసలు ధర రూ.9,999 కాగా.. ప్రారంభ ఆఫర్ కింద కేవలం రూ.5,999కే అందిస్తున్నారు. ఇది క్లాసిక్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ ఆడియో సిస్టమ్ కావాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక.

Advertisement

Also Read: అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2 మొత్తం 150W ఆడియో అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఈ సెటప్‌లో మూడు డ్రైవర్లు ఉన్న సౌండ్‌బార్, శక్తివంతమైన సబ్‌వూఫర్, రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇవి ఇంట్లోని ప్రతి మూలకూ స్పష్టమైన ఆడియోను అందిస్తాయి. దీని రిమోట్ ద్వారా మ్యూజిక్, మూవీ, న్యూస్, నైట్ అనే నాలుగు ఈక్యూ మోడ్స్‌ను మార్చుకుంటూ నచ్చిన విధంగా ఆడియోను ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

ఈ సిస్టమ్‌లో లేటెస్ట్ బ్లూటూత్ 5.3తో పాటు హెచ్‌డీఎమ్‌ఐ (ARC), ఆప్టికల్, యూఎస్‌బీ, ఆక్స్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ లేదా గేమింగ్ కన్సోల్‌లకు దీనిని సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. శాటిలైట్ స్పీకర్ల కోసం 5 మీటర్ల కేబుల్స్ ఇస్తుండటంతో వీటిని ఇంట్లో నచ్చిన చోట అమర్చుకోవడం చాలా తేలిక. బాక్స్‌లోనే వాల్-మౌంటింగ్ యాక్సెసరీస్ కూడా లభిస్తాయి.

Also Read: గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Related News

ట్రావెల్ చేసేవారికి జాక్‌పాట్! రూ.1,100 లోపు బెస్ట్ పవర్ బ్యాంక్ ఇదే బాస్

రూ. 4,000 లోపు వాచ్ కొంటున్నారా? ఈ రివ్యూ చూశాకే డిసైడ్ అవ్వండి!

డిస్కౌంట్ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్.. స్టైలిష్ డిజైన్, 52 గంటల బ్యాటరీ

వాటర్ వేస్టేజ్ లేదు, మినరల్స్ మిస్ అవ్వవు ! ప్రతీ మోడర్న్ ఇంటికి పర్ఫెక్ట్ సెట్

మతిపోయే ఫీచర్లతో కొత్త వాషింగ్ మెషీన్స్.. ఆఫర్ పోతే మళ్లీ రాదు

వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!

వానలో ఆఫీస్‌కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!

SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!

Big Stories

Advertisement
×