E-Paper
Advertisement

నో ఇంటర్నెట్.. నో సిగ్నల్.. అయినా Google Maps సూపర్‌గా పనిచేస్తుందిలా!

నో ఇంటర్నెట్.. నో సిగ్నల్.. అయినా Google Maps సూపర్‌గా పనిచేస్తుందిలా!
Advertisement

Google Maps Offline: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలన్నా, దారి తెలుసుకోవాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. అయితే, ప్రయాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సిగ్నల్ పోయినా లేదా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయినా చాలామంది కంగారు పడుతుంటారు. కానీ, ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.

ఆఫ్‌లైన్ మ్యాప్స్ మ్యాజిక్:

గూగుల్ మ్యాప్స్‌లో ‘ఆఫ్‌లైన్ మ్యాప్స్’ అనే ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. దీని ద్వారా మనం వెళ్లాలనుకునే ప్రాంతపు మ్యాప్‌ను ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసిన మ్యాప్స్ మన ఫోన్ మెమరీలో సేవ్ అవుతాయి. ఆ తర్వాత నెట్ ఆన్ చేయకపోయినా, అసలు సిగ్నల్ లేని అడవుల్లో ఉన్నా కూడా ఈ మ్యాప్ మనకు దారి చూపిస్తుంది.

జీపీఎస్ టెక్నాలజీ సాయం:

Advertisement

చాలా మందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. ఇంటర్నెట్ లేనప్పుడు మన లైవ్ లొకేషన్ మ్యాప్‌లో ఎలా కనిపిస్తుంది? దీని వెనుక ఉన్న రహస్యం GPS టెక్నాలజీ. మన స్మార్ట్‌ఫోన్లలో ఉండే జీపీఎస్ సిస్టమ్ నేరుగా శాటిలైట్లతో అనుసంధానమై ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. కాబట్టి.. ఆఫ్‌లైన్ మ్యాప్ ఆన్ చేసినప్పుడు ఈ జీపీఎస్ మన ప్రస్తుత లొకేషన్‌ను కచ్చితంగా గుర్తిస్తుంది.

Also Read: ల్యాండ్‌స్కేప్ కెమెరాతో శాంసంగ్ కొత్త టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

ముందే ప్లాన్ చేసుకోవడం ఎలా?

Advertisement

మీరు ఏదైనా సిగ్నల్ లేని ప్రాంతానికి లేదా లాంగ్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు, ఇంట్లోనే వైఫై ఉన్న సమయంలో ఆ రూట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. గూగుల్ మ్యాప్స్ యాప్‌లోకి వెళ్లి, మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే ‘ఆఫ్‌లైన్ మ్యాప్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీకు కావలసిన ఏరియాను సెలెక్ట్ చేసుకుని డౌన్‌లోడ్ బటన్ నొక్కితే సరిపోతుంది.

ఆఫ్‌లైన్‌లో ఏమేం పనిచేస్తాయి?

ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మీరు డౌన్‌లోడ్ చేసిన ఏరియాలో డ్రైవింగ్ రూట్స్ తెలుసుకోవచ్చు. అలాగే నిర్దిష్టమైన లొకేషన్లను సెర్చ్ చేయవచ్చు. టర్న్-బై-టర్న్ వాయిస్ నావిగేషన్ కూడా ఎంచక్కా పనిచేస్తుంది. అయితే, ఆ సమయంలో లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, ప్రత్యామ్నాయ మార్గాలు, బస్సు, రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సమాచారం మాత్రం లభించదు.

డేటా, బ్యాటరీ ఆదా:

ఈ ఆఫ్‌లైన్ మ్యాప్స్ వల్ల కేవలం సిగ్నల్ లేనప్పుడే కాదు.. నార్మల్ టైమ్‌లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు పదే పదే మ్యాప్ లోడ్ అవ్వడానికి ఎక్కువ డేటా ఖర్చవుతుంది. అలాగే బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. ముందే మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల డేటా మిగలడమే కాకుండా.. ఫోన్ బ్యాటరీ కూడా ఎక్కువ సమయం వస్తుంది.

Also Read: బ్యాక్ కెమెరా చూస్తూ సెల్ఫీలు తీసుకునేలా ఒప్పో సరికొత్త యాక్సెసరీ.. Reno 16 ఫోన్ల ధర, ఫీచర్లు ఇవే!

Related News

పల్లె ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన BSNL.. రూ.259కే నెలంతా హై-స్పీడ్ డేటా, ఉచిత కాల్స్!

అల్టిమేట్ క్లీనింగ్ కోసం.. అమెజాన్ ట్రెండింగ్ క్లీనర్స్ లిస్ట్

సినిమా హాల్ లాంటి ఫీల్.. తక్కువ బడ్జెట్‌లో టాప్ 5 స్మార్ట్ ప్రొజెక్టర్స్

ఇకపై రాత్రిపూట కూడా సూర్యకాంతి.. అమెరికా కొత్త స్పేస్ ప్రాజెక్ట్‌పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?

రూ.1,999కే 18 రోజుల బ్యాటరీ లైఫ్..హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న స్మార్ట్‌వాచ్!

బిజినెస్ కైనా, ఇంటికైనా.. స్ట్రాంగ్ కూలింగ్ ఇచ్చే బెస్ట్ డీప్ ఫ్రీజర్స్

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ కళ్లను కాపాడే యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే లాప్‌టాప్స్!

బ్లాక్‌బస్టర్ డీల్.. Samsung Galaxy S26 Ultraపై ఎగిరి గంతేసే భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేయండి!

Big Stories

Advertisement
×