E-Paper
Advertisement

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?
Advertisement

Gurthukosthunnaayi Web series review:బేబీ సినిమాతో హీరోగా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విరాజ్ అశ్విన్ ఇప్పుడు హీరోగా రూపొందిన ఈటీవీ ఒరిజినల్ వెబ్ సిరీస్ గుర్తుకొస్తున్నాయి. జూలై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? 90స్ కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అంటూ ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేసిన చిత్ర బృందం సక్సెస్ అయ్యిందా? తదితర విషయాలు తెలియాలి అంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

గుర్తుకొస్తున్నాయి సినిమా స్టోరీ..

విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా శరత్ చంద్ర నాయుడు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి వినోద్ గాలి దర్శకత్వం వహించారు. రోహిణి హట్టంగడి, శివన్నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక నేటి నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను జూలై 1న శ్రీరాములు థియేటర్స్ లో స్పెషల్ ప్రీమియర్ వేసిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయాన్నికొస్తే.. సంతోష్ (విరాజ్) కి పెళ్లి కుదురుతుంది. స్కూల్లో తన క్లాస్మేట్ వైశాలి (యశశ్రీరావు) తో ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి కూడా సంతోష్ ప్రేమను ఒప్పుకుంటుంది.అయితే వైశాలి తండ్రి, తన స్కూల్ హెడ్మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఇక ఆయనను ఎట్టకేలకు ఒప్పించి ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతారు. స్నేహితులు గణేష్ (వైవా రాఘవ), శ్రీకాంత్ (సిద్దు పవన్), ఆనంద్ (గోదావరి గోపి) లకు ఈ విషయాన్ని చెబుతారు. ఇక దీంతో గోవాలో వీరు బ్యాచిలర్స్ పార్టీ అడుగుతారు.

Advertisement

ఇక ఈ విషయాన్ని వైశాలికి చెబితే జాతకం ప్రకారం మూడు రోజులు హైదరాబాదు సిటీ దాటి బయటకు వెళ్లకూడదని నాన్న చెప్పారని సంతోష్ కి చెబుతుంది వైశాలి..అయితే రఘునాథ మాటను లెక్కచేయకుండా స్నేహితులతో కలిసి గోవా వెళ్తాడు సంతోష్. ఇక అలా ప్రయాణిస్తున్న సమయంలో దారిలో గేదె అడ్డు వస్తుంది. దానిని తప్పించబోయి సడన్ బ్రేక్ వేస్తాడు. స్టీరింగ్ కి తల గట్టిగా తగలడంతో గతం మర్చిపోతాడు. అయితే ఈ విషయం పెళ్లి దాకా మామకు తెలియకుండా ఆ స్నేహితులు, ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ సంతోష్ కి చిన్నప్పటి ముచ్చట్లని రీ క్రియేట్ చేసి గుర్తు చేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు. మరి హీరోకి గజినీ రోగం పోయిందా? గతం మర్చిపోయిన విషయం మామకు తెలియకుండా జాగ్రత్త పడ్డారా? పెళ్లి అయ్యిందా? అనేదే మిగతా స్టోరీ.

విశ్లేషణ..

ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లు.. డైరెక్టర్ వినోద్ గాలి 90స్ కిడ్స్ ముచ్చట్లు అని చెప్పి గట్టిగానే గాళం వేశారు. ఇక 90లలో స్కూల్ కి వెళ్లి అల్లరి చేసిన మనలాంటి బ్యాచ్ కి ఈ సీన్లు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ఫస్ట్ ఆఫ్ అంటే మొత్తం నాలుగు ఎపిసోడ్లు. స్నేహితుల అల్లరి చూసి ఫుల్లుగా నవ్వుకుంటారు. ఇక గతం మర్చిపోయిన సంతోష్ ను మేనేజ్ చేయడానికి ఆ బ్యాచ్ పడే పాటలు చూస్తే మరీ మన గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అని పక్కాగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మిగిలిన మూడు ఎపిసోడ్లు.. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్టర్ మన మీద ఎమోషనల్ అటాక్ మొదలు పెట్టాడు. ఇక తర్వాత అంతా సీరియస్ ఎమోషన్స్, అమ్మమ్మ సెంటిమెంట్లు, ఫస్ట్ నాలుగు ఎపిసోడ్లు కడుపుబ్బా నవ్విస్తే మిగిలిన మూడు ఎపిసోడ్లు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాడు.

Advertisement

also read:ఎందుకీ సిగ్గులేని కక్ష సాధింపులు.. జనాలు చూస్తున్నారు.. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై మళ్లీ స్పందించిన ప్రకాష్ రాజ్!

నటీనటుల పర్ఫామెన్స్..

విరాజ్ అంతా కన్ఫ్యూజన్లో చాలా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. ఇక యశశ్రీ తన పాత్రకు చాలా క్యూట్ గా సెట్ అయింది. మిగతా స్నేహితుల గ్యాంగ్ ఈ సీరీస్ కి మెయిన్ హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అటు ప్రియదర్శిని రామ్, డాక్టర్గా చేసిన అనీష్, రోహిణి హట్టంగడి వాళ్ళ అనుబంధం అంతా కూడా తెరమీద చాలా చక్కగా చూపించారు.

చివరిగా ఒక్క మాటలో చెప్పాలి అంటే మొదట్లో కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించి.. ఎండింగ్లో కన్నీళ్ళతో ట్యాంకర్లు నింపేశాడు డైరెక్టర్. ఇక మొత్తానికి బేబీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విరాజ్ అశ్విన్ ఈ వెబ్ సిరీస్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు.

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×