E-Paper
Advertisement

Saraswathi Review : సరస్వతి మూవీ రివ్యూ.. మంచి మెసేజ్ వేస్ట్ అయిపోయింది..

Saraswathi Review : సరస్వతి మూవీ రివ్యూ.. మంచి మెసేజ్ వేస్ట్ అయిపోయింది..
Advertisement

Saraswathi Review : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వెర్సటైల్ యాక్టర్ నుండి ఓ సినిమా వస్తుందంటే.. అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి మూవీ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ప్రస్తుతం ‘సరస్వతి’ పై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సినిమాకి సగం డైరక్షన్ స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ చేసి తప్పుకోవడం.. తర్వాత వరలక్ష్మీ టేకప్ చేసి ఫినిష్ చేయడంతో వార్తల్లో కూడా నిలిచింది. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి

కథ: 

లక్ష్మి(వరలక్ష్మీ శరత్ కుమార్) ఓ సింగిల్ మధర్. భర్తతో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయిన తర్వాత ఆమె ఓ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు.అయితే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం నాడు సరస్వతి పుట్టినరోజు కూడా కావడంతో.. తనని స్కూల్ దగ్గర వదిలి వెళ్తుంది లక్ష్మి. అయితే సాయంత్రం స్కూల్ కి వెళ్తే.. అక్కడ సరస్వతి ఉండదు. దీనిపై ఆమె ఆరా తీస్తే.. అసలు సరస్వతి అనే పాప తమ స్కూల్లోనే లేదని విద్యార్దులు, టీచర్లు చెబుతారు. అయితే అదే రోజు రాత్రి లక్ష్మికి సరస్వతి కాల్ చేసి తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని కంగారు పడుతూ చెబుతుంది. దీంతో అక్కడికి వెళ్ళి చూస్తే.. సరస్వతి రేప్..కి గురై చనిపోతుంది.దీంతో లక్ష్మి ప్రాణం నీరు కారిపోతుంది. బాధని దిగమింగుకుని కూతురి శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఆమె మాటలు నమ్మి పోలీసులు శ్మశాననికి వెళ్ళి తవ్వి చూస్తే అక్కడ పాప శవం ఉండదు. దీంతో కేసు ఫైల్ చేయలేం అని పోలీసులు చేతులెత్తేస్తారు. అయినా న్యాయం కోసం లక్ష్మి కోర్టుల చుట్టూ తిరుగుతుంది.ఈ క్రమంలో ఆమెకు లాయర్ రామానుజం(ప్రకాష్ రాజ్) పరిచయం అవుతాడు. అతను లక్ష్మి కేసుని టేకాఫ్ చేస్తాడు.ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అతను లక్ష్మి కేసులో విజయం సాధించాడా? అసలు సరస్వతిని పాడు చేసి చంపిన వాళ్ళు ఎవరు. స్కూల్ యాజమాన్యం ఎందుకు వాళ్ళకి సహకరించింది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

Advertisement

వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి, నిర్మించి, డైరక్షన్ కూడా చేసిన సినిమా ఇది. ఓ సినిమాకి ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం అంటే కత్తిమీద సాములాంటిదే. అందుకు వరలక్ష్మీని అభినందించొచ్చు. కానీ సింగిల్ మధర్ గా, పాప కోసం ఆరాటపడే తల్లిగా.. వరలక్ష్మీ 2 ఏళ్ల క్రితమే ‘శబరి’ అనే సినిమా చేసింది. ఆ కథకి.. ఈ కథకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి.లైన్ విన్నప్పుడు వరలక్ష్మీకి తన సినిమా గుర్తుకురాలేదా? అనేది ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. రొటీన్ గా అనిపించినా ఇంటర్వల్ వరకు సినిమా ఓకే.కానీ సెకండాఫ్ ఏమైనా గ్రిప్పింగ్ నెరేషన్ తో ఉంటుందా? అంటే అదీ లేదు. అడివి శేష్ ‘క్షణం’ నుండి మొన్నమధ్య వచ్చిన ‘త్రిభాణధారి బార్బరిక్’ అనే సినిమా వరకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. ట్విస్టులు కూడా మనం ముందే ఊహించేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం అంతా డైరక్షన్లోనే ఉంది. బహుశా వరలక్ష్మీ సగంలో ప్రాజెక్ట్ టేకప్ చేయడం వల్ల హడావిడిగా చేసేసి ఉండొచ్చు. టెక్నికల్ గా జస్ట్ ఓకే. అలా అని గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

నటీనటుల విషయానికి వస్తే.. వరలక్ష్మీ నటన గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమిలేదు . మరో సహజనటి అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. పాప పాత్రలో చేసిన నివేక్ష కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ప్రియమణి పాత్ర పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా లేదు. ప్రకాష్ రాజ్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. రమేష్, మురళి శర్మ, గెటప్ శ్రీను, సప్తగిరి, తులసి వంటి వాళ్ళు ఓకే ఓకే అనిపిస్తారు.

ప్లస్ పాయింట్స్ :

Advertisement

ఫస్ట్ హాఫ్

మెసేజ్

వరలక్ష్మీ నటన

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

డైరక్షన్

సెకండాఫ్

మొత్తంగా ‘సరస్వతి’ సినిమాలో ఇప్పటి సమాజనికి అవసరమైన మెసేజ్ ఉంది. కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ఆ మెసేజ్ కి తగ్గ గౌరవప్రదమైన ఫలితం దక్కకపోవచ్చు.

Saraswathi Movie Rating : 1.75/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×