E-Paper
Advertisement

‘తిమ్మరాజుపల్లి టీవీ’ థియేటర్ ప్రేక్షకులను మెప్పించిందా.. ఫుల్ రివ్యూ..

‘తిమ్మరాజుపల్లి టీవీ’ థియేటర్ ప్రేక్షకులను మెప్పించిందా.. ఫుల్ రివ్యూ..
Advertisement

Thimmaraju Palli TV Review: హీరోగా తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం నిర్మాతగా తీసిన సినిమా ‘తిమ్మరాజు పల్లి టీవీ’. రా ఎమోషన్లతో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ప్రేక్షకుల మందుకు వచ్చింది. చిత్తూరు నేపథ్యం, గ్రామీణ వాతావరణం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

నేపథ్యం

టైటిల్‌లో ఉన్నట్టుగానే ఈ సినిమా ఒక పల్లెటూరి టీవీ సెంటర్ చుట్టూ తిరుగుతుంది. చిత్తూరు యాసలో సాగే ఈ కథలో ఊరి జనం ముచ్చట్లు, చిన్నపాటి గొడవలు, ప్రేమాయణాలు ఉంటాయి. దర్శకుడు మునిరాజు కొత్త నటీనటులతో ఒక రియలిస్టిక్ డ్రామాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కథలో అసలు మలుపులు, మిస్టరీ సెకండాఫ్ వరకు దాచిపెట్టి, అప్పటివరకు గ్రామీణ వినోదంతో నెట్టుకొచ్చారు.

Advertisement

Read also-జాతీయ స్థాయి అవార్డ్ గెలుచుకున్న బుల్లిరాజు.. అనిల్ రావిపూడి ఎమోషనల్..

విశ్లేషణ

సాయి తేజ్, ప్రదీప్ కొట్టే, వేద వంటి కొత్త నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా చిత్తూరు యాసను పలకడంలో వారు చూపించిన సహజత్వం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి అసలైన వెన్నెముక సంగీత దర్శకుడు వంశీకాంత్. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM)తో కొన్ని సాదాసీదా సీన్లను కూడా అద్భుతంగా ఎలివేట్ చేశారు. సినిమా చివరలో వచ్చే ఎమోషనల్ టచ్ బాగుంది. కథలోని చిక్కుముడులన్నీ విప్పుతూ, ఒక మంచి ఫీల్ గుడ్ నోట్‌తో సినిమాను ముగించడం ప్రేక్షకులకు ఊరటనిస్తుంది. సినిమాకు ప్రధాన బలహీనత నెమ్మదించిన కథనం. మొదటి భాగం అంతా ఒక యాడ్‌లాగా బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ప్రేక్షకుల ఓపికకు పరీక్ష ఎదురవుతుంది. సంగీతం బాగున్నప్పటికీ, కొన్ని కీలక సన్నివేశాల్లో భావోద్వేగాలు ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా ఉండవు. మేకింగ్‌లో ఉన్న పరిమితులు కొన్నిచోట్ల స్పష్టంగా కనిపిస్తాయి.

నిర్మాతగా కిరణ్ అబ్బవరం

Advertisement

కిరణ్ అబ్బవరం నిర్మాతగా చాలా తెలివైన ఎత్తుగడ వేశారు. తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తి చేసి, డిజిటల్ రైట్స్ ద్వారానే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడంలో సఫలమయ్యారు. ఇప్పుడు థియేటర్ల నుండి వచ్చే వసూళ్లు ఆయనకు అదనపు లాభమే. నటుడిగానే కాకుండా, కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ బిజినెస్ యాంగిల్‌లో కూడా ఆయన అడుగులు పటిష్టంగా ఉన్నాయి.

బలాలు..

  • నటీనటులు
  • సంగీతం
  • క్లైమాక్స్

బలహీనతలు..

  • స్క్రీన్‌ప్లే
  • ఎమోషనల్ కనెక్టివిటీ

చివరి ముచ్చట.. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఫస్టాఫ్ బోర్ భరించగలిగితే, సెకండాఫ్, క్లైమాక్స్ మిమ్మల్ని నిరుత్సాహపరచవు.

రేటింగ్: 2.25/5

Read also-‘పాపం ప్రతాప్’ సమస్య ఉందో లేదో కానీ, ప్రేక్షకుడికి మాత్రం వచ్చింది.. అది ఏంటో తెలియాలంటే?

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×