E-Paper
Advertisement

The Abandons Web Series Review : ‘ది అబాండన్స్’ సిరీస్ రివ్యూ

The Abandons Web Series Review : ‘ది అబాండన్స్’ సిరీస్ రివ్యూ
Advertisement

The Abandons Web Series Review : రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అమెరికన్ వెస్టర్న్ డ్రామా సిరీస్ ‘ది అబాండన్స్’. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా రిలీజ్ అయిన దీన్ని కుర్ట్ సట్టర్ (సన్స్ ఆఫ్ అనార్కీ క్రియేటర్) సృష్టించాడు. పీరియాడిక్ వెస్ట్రన్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

ది అబాండన్స్ కథ 1850 వాషింగ్టన్ టెరిటరీలోని ఆంజెల్స్ రిజ్ అనే టౌన్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఇద్దరు మహిళా లీడర్లు… కాన్స్టాన్స్ వాన్ నెస్ (గిలియన్ ఆండర్సన్), ఫియోనా నోలన్ (లీనా హెడీ) మధ్య ల్యాండ్ వార్ జరుగుతుంది. కాన్స్టాన్స్ ఒక మైనింగ్ మ్యాగ్నేట్, ఆమె టౌన్ ల్యాండ్‌ను మైనింగ్ కోసం కబ్జా చేయాలని చూస్తుంది. ఫియోనా ఒక రబెలియస్ రాన్చర్, ఆమె తన “అబాండన్స్” రాన్చ్ (అనాథలకు షెల్టర్)ను కాపాడుకోవాలని పోరాడుతుంది.

Advertisement

ఫియోనా ఫ్యామిలీలో ఎలియాస్ (నిక్ రాబిన్సన్), డాలియా (డయానా సిల్వర్స్), మైల్స్ (రయాన్ హర్స్ట్), వాల్టర్ (బ్రయన్ F. O’బైర్న్) అనే అనాథలు ఉంటారు. వీరంతా కలిసి తమ ప్లేస్ ను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తారు. ఈ క్రమంలోనే కాన్స్టాన్స్ గతంలోని ట్రాజెడీలు, ఊహించని ట్విస్ట్ బయట పడుతుంది. ఇంతకీ కాన్స్టాన్స్ గతం, ఆ ట్విస్ట్ ఏంటి ? మరి వీళ్ళ భర్తలు ఏమయ్యారు ? ఫియోనా, కాన్స్టాన్స్ మధ్య ఫైనల్ జరిగిన ఫైనల్ వార్ లో గెలిచింది ఎవరు ? జాక్ క్రీ ఎవరు ? అనే విషయాలు తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

విశ్లేషణ ఫ

గిలియన్ ఆండర్సన్, లీనా హెడీ పెర్ఫార్మెన్స్ సూపర్. వాళ్ల మధ్య వచ్చే కీలకమైన సీన్స్ సిరీస్ లో టెన్షన్, కెమిస్ట్రీని క్యారీ చేస్తాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్ కు సోల్ అని చెప్పవచ్చు. క్రియేటర్ కుర్ట్ సట్టర్ స్క్రిప్ట్‌లో వెస్టర్న్ ట్రోప్స్ (ల్యాండ్ వార్, మదర్హుడ్)కు మోడరన్ ట్విస్ట్ జోడించడం ఆసక్తికరంగా అన్పిస్తుంది. విజువల్స్ అయితే అద్భుతం. కొన్ని ఫైట్ సీన్స్, మెలోడ్రామా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదరహో అయితే కాదు. కానీ స్లోగా, ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇవన్నీ సినిమా పాజిటివ్స్ మాత్రమే.

Advertisement

స్క్రిప్ట్ ఓవర్-సీరియస్ గా అన్పిస్తుంది. అంతేకాదు కొన్ని సీన్స్ లో కంటిన్యూయేషన్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. స్లో పేసింగ్, ఎపిసోడ్స్ రన్‌టైమ్ (కొన్ని 30 నిమిషాలు, కొన్ని 1 గంట) ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. కొన్ని చోట్ల AI CGI ముఖ్యంగా స్టాంపీడ్ సీన్స్ తేలిపోయినట్టుగా అన్పిస్తుంది. ఇలాంటి జానర్ ను ఇష్టపడని ఆడియన్స్ కు సిరీస్ ఫ్రస్ట్రేటింగ్, ఇన్ కంప్లీట్ ఫీలింగ్ ను ఇస్తుంది. అంతేకాదు ఇందులో పెద్దలకు మాత్రమే అనే సీన్స్ కళ్ళు మూసుకుని చూడాల్సిన రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూడాలంటే కష్టమే.

ప్లస్ పాయింట్స్ :

నటీనటులు
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

స్లో పేసింగ్
ఎపిసోడ్స్ లెంగ్తీ రన్ టైమ్

మొత్తంగా… పీరియాడిక్ సిరీస్ ను చూడడం ఇష్టంలేని వారికి యమా బోర్ ఈ సిరీస్. వెస్టర్న్ ఫ్యాన్స్ కి మాత్రమే సూట్ అవుతుంది. ఫ్యామిలీతో డోంట్ వాచ్.

The Abandons Web Series Rating : 2/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×