E-Paper
Advertisement

Vishnu Vinyasam Review: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. ప్రేక్షకులకి ఆయాసం

Vishnu Vinyasam Review: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. ప్రేక్షకులకి ఆయాసం
Advertisement

Vishnu Vinyasam Review: ఎప్పటిలానే ఫిబ్రవరి నెల సరైన సినిమాలు లేక విలవిలలాడుతోంది. కొన్ని చోట్ల ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి సినిమాలనే సెకండ్ రిలీజ్ చేసుకుని నడిపించుకుంటున్నారు. అయినప్పటికీ ఎక్కువ శాతం జనాలు ధియేటర్లకి రావడం లేదు అనుకోండి. ఈరోజు రిలీజ్ అవుతున్న శ్రీ విష్ణు (Sree Vishnu) ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) సినిమా ఆ లోటు తీరుస్తుంది అని అంతా ఆశిస్తున్నారు. మరి వారి నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..

కథ:

విష్ణు( శ్రీ విష్ణు) ఒంగోలులో ఉన్న ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి జాతకాల పిచ్చి ఎక్కువ. ఉదయం లేచినప్పటి నుంచి, బయటకు వెళ్ళి చేసే ప్రతి పని, ఇంటికి తిరిగొచ్చాక పడుకునే వరకు జాతకాలనే ఫాలో అవుతూ ఉంటాడు. ఇతని తండ్రి (గోపరాజు రమణ)కి డబ్బు పిచ్చి ఎక్కువ. ఇలాంటి విష్ణుకి కాలేజీలో ఒక అమ్మాయి జున్ను(నయన్ సారిక) పరిచయం అవుతుంది. మొదట ఆమెతో గొడవ పడతాడు. తర్వాత ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యే టైమ్‌కి ఆమె జాతకం చూస్తాడు. ఆమె జాతకం గురించి తెలిశాక విష్ణు షాక్ అవుతాడు. జున్ను జాతకం ప్రకారం.. పెళ్ళైన 6 నెలలకి ఆమె భర్త చనిపోతాడట. దీంతో విష్ణు కన్ఫ్యూజన్‌కి గురవుతాడు. ఆమెను వదులుకోలేడు.. అలా అని ప్రాణాలు పణంగా పెట్టి పెళ్లి చేసుకోలేడు. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ అతను ఏం చేశాడు.? అనే దానికి సమాధానమే మిగిలిన సినిమా.

Advertisement

Also Read- MSVPG Film: చిరంజీవితో ఇలాంటి సినిమాలు సాహసమే.. శంకర వరప్రసాద్ పై పరుచూరి రివ్యూ!

విశ్లేషణ:

ఇప్పుడు విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు సోషల్ మీడియాలో కంటెంట్ వాడుకుని కామెడీ చేయాలని చూస్తున్నారు. శ్రీ విష్ణు కూడా అలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నప్పటికీ.. సోషల్ మీడియా జనాలకి కూడా స్టఫ్ ఇస్తూ ఉంటాడు. ఇదే శ్రీ విష్ణు స్టైల్. ముఖ్యంగా బూతులు మింగేస్తూ డబుల్ మీనింగ్లు వచ్చేలా అతను పలికే డైలాగులు జెంజి కిడ్స్‌ను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటాయి. విష్ణు విన్యాసం చిత్రానికి ప్లస్ అనిపించింది ఇదే. శ్రీ విష్ణును తీసేసి విష్ణు విన్యాసం కథ, కథనాలు గమనిస్తే లెక్క లేనన్ని లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ ఏమీ కనిపించదు. జాతకం అనే పాయింట్ చుట్టూ గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిట్టెమ్మ మొగుడు, కళ్యాణ రాముడు నుండీ చూసుకుంటే మొన్నామధ్య వచ్చిన ప్రియదర్శి సారంగపాణి జాతకం కూడా ఇలాంటి పాయింట్‌తో రూపొందినదే. సినిమా చూస్తున్నప్పుడు.. ఈ మాత్రం పాయింట్ కోసం ఇంత సాగదీసారా? అనిపిస్తుంది. బహుశా అందుకే విష్ణు విన్యాసం ట్రైలర్‌ను రిలీజ్ చేయలేదు అనుకుంట. దర్శకుడు యధునాథ్ మారుతీ రావు కథ, కథనాలపై కంటే శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ పైనే దృష్టి పెట్టాడు. అతనితో పలికించిన వన్ లైన్ పంచులు బాగున్నాయి. కానీ కథ, కంటెంట్‌కి ఆడియన్ కనెక్ట్ అవ్వకపోతే తెరపై ఎన్ని కామెడీ సీన్స్ వచ్చినా వాటిని ఎంజాయ్ చేయలేరు. ఇక నిర్మాత సుమంత్ నాయుడు ‘అల్లుడు అదుర్స్, హరోం హర’ సినిమాలతో చాలా నష్టపోయారు. వాటి వడ్డీల కోసం విష్ణు విన్యాసం చేసినట్టు ఉన్నారు. ఇందులోని ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే.. ఆయన బడ్జెట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ఎవ్వరికైనా అర్థం అవుతుంది. (Vishnu Vinyasam Review)

Advertisement

Also Read- MSVPG Film: చిరంజీవితో ఇలాంటి సినిమాలు సాహసమే.. శంకర వరప్రసాద్ పై పరుచూరి రివ్యూ!

నటీనటుల విషయానికి వస్తే.. ఇది శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. హీరోయిన్ నయన్ సారిక (Nayan Sarika) గ్లామర్ కూడా అతని కామెడీ టైమింగ్ ముందు తేలిపోయింది. గోపరాజు రమణ, మురళీ శర్మ, సత్యం రాజేష్ వంటి వాళ్లు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు అనే కంటే వాళ్ళ పారితోషికాలకి న్యాయం చేశారు అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:

శ్రీవిష్ణు
కామెడీ
రన్ టైమ్

మైనస్ పాయింట్స్:

కథ
సెకండాఫ్

మొత్తంగా ‘విష్ణు విన్యాసం’ శ్రీవిష్ణు మార్క్ కామెడీ అలరించినప్పటికీ.. సినిమాగా మాత్రం సంతృప్తినివ్వదు

రేటింగ్: 1.5/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×