E-Paper
Advertisement

Nilave Movie Review: నిలవే సినిమా రివ్యూ అండ్ రేటింగ్..సినిమా ఎలా ఉందంటే?

Nilave Movie Review: నిలవే సినిమా రివ్యూ అండ్ రేటింగ్..సినిమా ఎలా ఉందంటే?
Advertisement

Nilave Movie Review: సినీ ఇండస్ట్రీలో ప్రతివారం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదల కాగా మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం”నిలవే”(Nilave). మరి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంది ఈ సినిమా కథ ఏంటి విషయానికి వస్తే..

టైటిల్‌: నిలవే
నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు
నిర్మాణ సంస్థ: POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం
దర్శకత్వం – సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

కథ:

Advertisement

అర్జున్ (సౌమిత్ రావు) అనాథగా పెరిగి సినిమాలంటే ఆసక్తితో ఈయన ఒక యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుంటాడు. అర్జున్ అనాథ కావడంతో తనకి ఎవరూ లేకపోవడంతో తన స్నేహితుడు (వైవాహర్ష) ఇంట్లో ఉంటూ సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతూ ఉంటాడు. అర్జున్ అనాధ కావడంతో తనకంటూ ఒక కుటుంబం ఉండాలని కోరుకుంటాడు. దీంతో తనకు తోడుగా ఓ అమ్మాయి ఉండాలని భావిస్తాడు కానీ ఏ అమ్మాయి తన జీవితంలోకి రాదు. ఇలా అర్జున్ జీవితంలోకి అమ్మాయి రాకపోవడంతో ఎంతో డిప్రెషన్ కి గురి అయ్యి సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు.

తన అపార్ట్మెంట్లోనే ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అర్జున్ కు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఒక అందమైన అమ్మాయి అతిథి (శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. మొదటి చూపుతోనే తనలో ప్రేమలో పడిన అర్జున్ ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. అనుకున్న విధంగానే ఈయన అతిథితో తన పరిచయం పెంచుకొని తనతో చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే వీరిద్దరూ శారీరకంగా కూడా ఒకటవుతారు కానీ అర్జున్ ప్రేమను మాత్రం అతిథి అంగీకరించదు. ఇలా తన ప్రేమను అతిథి ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని అర్జున్ కోరిక నెరవేరుతుందా? అతిథి వచ్చిన తర్వాత అర్జున్ లో వచ్చిన మార్పులు ఏంటి? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

Advertisement

ఇప్పటివరకు ఎన్నో లవ్ స్టోరీ తో సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం కాస్త విభిన్నంగా ఉందని చెప్పొచ్చు. ఈ తరం వారికి బాగా కనెక్ట్ అయ్యే సినిమాగా ఉంది. హీరో ఆత్మహత్య ప్రయత్న సన్నివేశం కాస్త ఆసక్తికరంగా ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుంటున్నారు ఈ విషయాన్ని అర్జున్ పాత్ర ద్వారా డైరెక్టర్ చూపించిన తీరు బాగుంది. ఇక అర్జున్ పట్ల ప్రేమ ఉన్నప్పటికీ తనతో కలిసి ముందడుగు లేకపోవడానికి కారణం ఏంటని విషయంపై బాగా ఆసక్తిని కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ లో కథ చాలా ఎమోషనల్ గా కొనసాగుతుంది అతిథి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఎమోషనల్ గా ఉంటుందని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ల నటన
చివరి వరకు ట్విస్ట్ రివిల్ చేయకపోవడం
అతిథి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ

మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు సాగదీశారు

మొత్తానికి: నిలవే సినిమాలు అందరూ కొత్తవారు నటించిన సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన వారికి మాత్రం మంచి అనుభూతిని కలిగిస్తుంది

రేటింగ్: 2.75/5

Also Read: Nilave Movie Review: నిలవే సినిమా రివ్యూ అండ్ రేటింగ్..సినిమా ఎలా ఉందంటే?

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×