E-Paper
Advertisement

Santhana Prapthirasthu Movie Review : ‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ రివ్యూ : టైం పాస్ మస్తు మస్తు

Santhana Prapthirasthu Movie Review : ‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ రివ్యూ : టైం పాస్ మస్తు మస్తు
Advertisement

Santhana Prapthirasthu Movie Review : ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఒకటి. ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పించిన ఈ సినిమా.. థియేటర్లలో ఆడియన్స్ కి ఎలాంటి ఫీల్ ఇచ్చిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…

కథ :

చైతన్య(విక్రాంత్) ఓ అనాధ. అయినప్పటికీ కష్టపడి చదువుకుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఎదుగుతాడు. కానీ ఇంట్రోవర్ట్ కావడంతో అతను అమ్మాయిలతో మాట్లాడలేడు.అయితే ఒకసారి తన స్నేహితుడు(అభినవ్ గోమఠం) ని గ్రూప్ వన్ ఎగ్జామ్ కి తీసుకువెళ్తూ కళ్యాణి(చాందినీ చౌదరి) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు.తర్వాత ఆమెతో పరిచయం ఏర్పరుచుకుంటాడు. అది ప్రేమ వరకు వెళ్తుంది. కానీ ఇందుకు కళ్యాణి తండ్రి అడ్డుపడతాడు. తర్వాత ఓ రౌడీ(తరుణ్ భాస్కర్) సలహా మేరకు ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. సెపరేట్ గా కాపురం పెడతారు.

Advertisement

అయినప్పటికీ కళ్యాణి తండ్రి వీరిని వదలకుండా.. ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టి విడగొట్టాలని ప్రయత్నిస్తాడు. ఇందులో భాగంగా కళ్యాణిని వంద రోజుల్లో ప్రెగ్నెంట్ చేయాలనే కండిషన్ పెడతాడు చైతన్యకి. అయితే అతనికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల పిల్లలు కలగరు అని వైద్యులు చెబుతారు. ఈ క్రమంలో చైతన్య-కళ్యాణి..ల జీవితం ఏమైంది? అసలు కళ్యాణి తండ్రి వీళ్ళని ఎందుకు విడగొట్టాలని చూశాడు. మధ్యలో ఫెర్టిలిటీ సెంటర్ల నేపధ్యం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

దర్శకుడు సంజీవ్ రెడ్డి ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు. ఇతని మొదటి సినిమా ‘లాగిన్’ తోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు. కానీ దానికి దక్కాల్సిన ఆదరణ దక్కలేదు. తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని అల్లు శిరీష్ తో ‘ఎబిసిడి’ చేశాడు. అది కూడా ఆడలేదు. అయితే జీ వారి నిర్మాణంలో రాజ్ తరుణ్ తో చేసిన ‘ఆహా నా పెళ్ళంట’ అనే వెబ్ సిరీస్ ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో ఇతను డీల్ చేసిన కామెడీ, యూత్ కి ఇవ్వాల్సిన మెసేజ్ ను కరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఇతనికి దక్కాల్సిన క్రెడిబిలిటీ దక్కింది. మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టం పరీక్షించుకునేందుకు ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

ఈ సినిమా విషయంలో కూడా తన ప్లస్ పాయింట్స్ పైనే ఆధారపడి సేఫ్ గేమ్ ఆడాడు అని చెప్పాలి. సంజీవ్ స్ట్రెంత్ కామెడీ, యూత్ ఫుల్ కంటెంట్. దానినే ప్రధానంగా చేసుకుని ‘సంతాన ప్రాప్తిరస్తు’ చేశాడు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ చాలా మందికి తెలిసిందే. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్లలో చాలా మందికి వీర్య లోపం అనేది ఎక్కువవుతూ వస్తుంది.అందుకే ఫెర్టిలిటీ సెంటర్లు కూడా పెరిగిపోతున్నాయి.

ఈ సున్నితమైన అంశాన్ని తీసుకుని యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా వినోదాన్ని మేళవించి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ని మలిచాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, క్లైమాక్స్ లో ఎమోషన్ వర్కౌట్ అయ్యాయి. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి మార్కులు వేయించుకుంటాయి. నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి ఏమీ లేదు.

నటీనటుల విషయానికి వస్తే.. విక్రాంత్ తన మొదటి సినిమా స్పార్క్ తో పోలిస్తే ఈ సినిమాలో లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. చాందినీ ఎప్పటిలానే పక్కింటి అమ్మాయి తరహాలో మెప్పించే ప్రయత్నం చేసింది. కొంచెం గ్లామర్ డోస్ కూడా పెంచేందుకు రెడీ అయినట్టు సిగ్నల్ ఇచ్చింది.అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్..ల కామెడీ అలరిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

యూనివర్సల్ అప్పీల్ ఉన్న పాయింట్
కామెడీ
ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉండటం
కొన్ని డైలాగులు

మొత్తంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఈ వీకెండ్ కి థియేటర్ కి వెళ్లి కాసేపు నవ్వుకోవడానికి కరెక్ట్ మూవీ. అలా అని అంచనాలు ఎక్కువ పెట్టుకోవద్దు.

Santhana Prapthirasthu Movie Rating : 2.75/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×