E-Paper
Advertisement

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ట్విట్టర్ రివ్యూ.. రామ్ హిట్ కొట్టాడా..?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ట్విట్టర్ రివ్యూ.. రామ్ హిట్ కొట్టాడా..?
Advertisement

Andhra King Taluka Twitter Review: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం `ఆంధ్ర కింగ్‌ తాలూకా`.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు. ఈ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. భారీ అంచనాలతో ఈ మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఫేమ్‌ మహేష్‌ బాబు పి దర్శకత్వం వహించిన ఈ మూవీలో లేటెస్ట్ యంగ్‌ సెన్సేషన్‌ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది.. నేడు థియేటర్లలోకి వచ్చేసిన రామ్ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

హీరో రామ్ గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు.. ఈమధ్య ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. మరి సినిమా టాక్ ఎలా ఉందో? పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

Advertisement

రామ్ యాక్టింగ్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, బాగా రాసుకున్న డైలాగ్స్ దీనికి బాగా పనిచేశాయి. మైత్రి మూవీ మేకర్స్ నుండి రాజీపడని నిర్మాణ విలువలు ఈ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యింది. మొదటి 30 నిమిషాలలో స్లో పేస్ ఉన్నప్పటికీ, ఫిల్మ్ గ్రాఫ్‌లో ఉంది

క్లైమాక్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ మూవీ రామ్ ఫ్యాన్స్ కు పండగే అని ఓ నెటిజన్ ట్వీట్స్ చేశారు..

Advertisement

ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఇవాళ భారీ అంచనాలతో వచ్చేసింది.. రామ్ కుమ్మెశాడు.. రామ్, భాగ్య శ్రీ కెమిస్ట్రీ అదిరిపోయింది. బాగా చేశారు. ప్రతి హీరో ఫ్యాన్ కనెక్ట్ అవుతాడు. సినిమాలు సూపర్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఎవడురా రామ్ కు స్క్రిప్ట్ సెలెక్షన్ రాదు అన్నది.. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అదిరిపోయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం రామ్ పోతినేని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు భారీ హైప్ నెలకొంది. గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు పెరిగాయి.. దాంతో ఈ సినిమా కోసం రామ్ పోతినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.. మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుందని రివ్యూలను చూస్తే అర్థమవుతుంది.. మొత్తానికి రామ్ కష్టం వృధా పోలేదని తెలుస్తుంది. ఇందులో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దాంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లు బాగానే ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం టాక్ ప్రకారం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కలెక్షన్స్ ఏమాత్రం వసూల్ అవుతాయో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×