E-Paper
Advertisement

షాకింగ్ రివ్యూ: రాకాస హిట్టా ? ఫట్టా? కానీ లాజిక్ ఎక్కడ?

షాకింగ్ రివ్యూ: రాకాస హిట్టా ? ఫట్టా? కానీ లాజిక్ ఎక్కడ?
Advertisement

Rakasa Review: ఈ వారం థియేటర్లలోకి ‘రాకాస’ (Rakasa) రూపంలో ఒక అసలు సిసలు ‘చందమామ కథ’ వచ్చేసింది. నిహారిక కొణిదెల నిర్మాణంలో, సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తోంది? ముసుగులు తీసి అసలు మ్యాటర్ మాట్లాడుకుందాం.. మొహమాటాలు అస్సలే లేవు.. ఇక రివ్యూ చూసేద్దామా మరి..

Read also-‘బ్రహ్మముడి’ సీరియల్‌ ఏఫ్రిల్‌ 3: కిడ్నాప్ గురించి రాజు, లక్కీలకు చెప్పిన ఐశ్వర్య 

కథ

Advertisement

అమెరికా నుంచి తన ప్రియురాలు సుకన్య కోసం ఊరికి వచ్చిన వీరబాబు అలియాస్ ఈరబాబు (సంగీత్ శోభన్), అక్కడ పరిస్థితుల వల్ల సుబ్బలక్ష్మి (నయన్ సారిక) ప్రేమలో పడతాడు. అయితే, ఊహించని విధంగా ఒక హత్య కేసులో ఇరుక్కున్న ఈరబాబుకు గ్రామస్తులు ఒక విచిత్రమైన శిక్ష వేస్తారు. ‘రాక్షసుడు ఉన్నాడని అందరూ నమ్మే’ ఒక పాత కోటలోకి అతడిని పంపిస్తారు. ఆ కోటలో నిజంగా రాక్షసుడు ఉన్నాడా? అసలు ఆ కోట వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈరబాబు ఆ గండం నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ ‘రాకాస’ కథ. విఠలాచార్య సినిమాల తరహాలో సాగే ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో కామెడీ మస్తుగా ఉంది!

విశ్లేషణ

సినిమాకి అసలైన బలం సంగీత్ శోభన్ పెర్ఫార్మెన్స్! తన టైమింగ్‌తో సినిమాని భుజాల మీద వేసుకుని నడిపించాడు. ఫస్టాఫ్‌లో గెటప్ శ్రీనుతో, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో వచ్చే సీన్లు థియేటర్లో ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తుతాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ – సంగీత్ కాంబో సీన్స్ సినిమాకి మేజర్ అసెట్. దర్శకురాలు మానస శర్మ పాత కథనే కొత్తగా, ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో చూపించిన తీరు బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ సినిమాకి బ్యాక్ బోన్ లా నిలిస్తే, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ ఆ కోట వాతావరణాన్ని చాలా లైవ్లీగా, కలర్ ఫుల్ గా చూపించింది. నిహారిక కొణిదెల ప్యాషన్ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మేకింగ్ వాల్యూస్ సినిమా స్థాయిని పెంచాయి.

Advertisement

Read also-రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ థ్రిల్ల‌ర్‌… గే కపుల్స్ కొడుకు స్పై ఏజెంట్ గా

సినిమాలో కామెడీ పండినా, కొన్ని విషయాల్లో మాత్రం పాత వాసన కనిపిస్తుంది. కథ పరంగా చూస్తే ఇది మనం చిన్నప్పుడు విన్న చందమామ కథల తరహాలోనే ఉంటుంది. కథలో పెద్దగా ట్విస్టులు ఏమీ లేవు. ఇది ఒక ఫాంటసీ సినిమా కాబట్టి, బుర్రకు పని చెప్పకుండా, లాజిక్స్ వెతక్కుండా చూస్తేనే ఎంజాయ్ చేయగలరు. కొన్ని సీన్లు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. సెకండాఫ్ సినిమాకి ప్రాణం పోసినా, ముగింపు ఎలా ఉంటుందనేది సగటు ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేయొచ్చు.

బలాలు..

  • సంగీత్ శోభన్
  • ఫాస్ట్ స్క్రీన్ ప్లే
  • మ్యూజిక్

బలహీనతలు

  • పాత కథ
  • ట్విస్టులు లేకపోవడం
  • లాజిక్స్ నిల్..

మొత్తంగా.. లాజిక్స్ వెతక్కుండా హాయిగా రెండున్నర గంటలు నవ్వుకోవాలంటే ఈ వారం ‘రాకాస’ పక్కా ఛాయిస్!

Rakasa movie Rating And Reveiw :- 3 / 5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×