E-Paper
Advertisement

Suyodhana movie Review: ప్రియదర్శి ‘సుయోధన’ మూవీ రివ్యూ

Suyodhana movie Review: ప్రియదర్శి ‘సుయోధన’ మూవీ రివ్యూ
Advertisement

Suyodhana movie review : చిన్న నటుడిగా మొదలుపెట్టి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ప్రియదర్శి. కామెడీ పాత్రల నుంచి, కథానాయకుడి పాత్రల దాకా ఈ నటుడు బిజీ అరిస్ట్ గా మారాడు. ఇప్పుడు ఒక కొత్త రకం పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బలగం’ తర్వాత అతను ఎంచుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ‘సుయోధన’. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సాయి కుమార్, ప్రేమ, ద్రిషిక చందర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న థియేటర్లలో విడుదలైంది.

కథా నేపథ్యం

హీరో వరుణ్ (ప్రియదర్శి) ఒక ఫోలీ ఆర్టిస్ట్. అంటే నాటకాలలో రకరకాల శబ్దాలు క్రియేట్ చేసేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఒక వింత సమస్య ఉంటుంది. తనకి మాత్రమే ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్‌ని అతను ‘సుయోధన’ అని పిలుచుకుంటూ ఉంటాడు. ఆ శబ్దం విన్నప్పుడల్లా దుర్యోధనుడి ఆకారం కళ్ల ముందు కదులుతుంది. అతను ఆ వాయిస్ చెప్పినట్టే వింటుంటాడు. అతని తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటాడు. ఆయనకు కూడా దుర్యోధనుడి పాత్రంటే ఇష్టం. తండ్రి నాటకాలు ఆపేసిన తర్వాత పెద్దయ్యాక వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకుని జీవితం సాగిస్తాడు.

Advertisement

ఇదే సమయంలో హీరోయిన్ సమిత (ద్రిషిక చందర్) ఒక సినిమా షూటింగ్‌ లో వరుణ్‌ ని కలుస్తుంది. అప్పటి నుంచి వరుణ్ జీవితం తలకిందులు అవుతుంది. రాజకీయాల్లో ఎదుగుతున్న తండ్రి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా హత్యకు గురవుతాడు. దీంతో కథలో మరిన్ని మలుపులు తిరుగుతాయి. రాజకీయాలు, కుటుంబ సంబంధాలు, సైకలాజికల్ ట్విస్టులు కలిసి కథను ముందుకు నడిపిస్తాయి. అసలు వరుణ్ తండ్రిని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? సుయోధన అనే శబ్దం వరుణ్ కి ఎందుకు వినిపిస్తుంది? ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా ? అన్నది సినిమా ముఖ్యమైన భాగం.

విశ్లేషణ

ప్రియదర్శి ఈ సినిమాలో తనకు కొత్త రకం పాత్రలో కనిపించాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌లో భయం, గందరగోళం, ఎమోషన్స్ మిళితమైన పాత్రను బాగా చేశాడు. సాయి కుమార్ డైలాగ్ పవర్‌తో సినిమాకు బలం ఇచ్చాడు. ద్రిషిక చందర్‌కు మంచి స్కోప్ ఉంది కానీ పాత్ర పూర్తిగా ఉపయోగపడలేదు. దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి తొలి సినిమాకి తగ్గట్టు సస్పెన్స్ క్రియేట్ చేయడంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ‘ఫోలీ’ ఆర్టిస్ట్ అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. జై క్రిష్ సంగీతం భావోద్వేగాలను బాగా ఎత్తి చూపించింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే మొదటి హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్‌గా ఉన్నా, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరికొంత పకడ్బందీగా ఉంటే బాగుండేది. ఎమోషనల్ సీన్స్ కొన్ని చోట్ల ఓవర్ డ్రామాటిక్‌గా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్

Advertisement

ప్రియదర్శి నటన
డైలాగ్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్

మొదటి హాఫ్‌లో సాగదీత
కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించడం
హీరోయిన్ పాత్ర
క్లైమాక్స్‌

మొత్తానికి

ప్రియదర్శి ఫ్యాన్స్‌, సస్పెన్స్ ఇష్టమైన వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఓసారి చూడవచ్చు.

రేటింగ్ : 2.5/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×