// // Sky Movie Review : రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ 'స్కై' రివ్యూ -->
E-Paper
Advertisement

Sky Movie Review : రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ ‘స్కై’ రివ్యూ

Sky Movie Review : రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ ‘స్కై’ రివ్యూ
Advertisement

Sky Movie Review : డైరెక్టర్ పృధ్వీ పేరిచెర్ల (Prithvi Pericherla) డెబ్యూ చిత్రం “స్కై”. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ తెలుగు ఎమోషనల్ డ్రామా-రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాతో మురళీ కృష్ణంరాజు (Murali Krishnam Raju) హీరోగా పరిచయమవుతున్నాడు, హీరోయిన్ గా శృతి శెట్టి (Shruti Shetty) నటించింది. వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పేరిచెర్ల సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ

సినిమాలో ప్రభు (ఆనంద్), విక్కీ (మురళీ కృష్ణంరాజు), వీణ (శృతి శెట్టి) మెయిన్ లీడ్స్. ప్రభు సింగర్‌ గా సక్సెస్ కావాలని కలలు కనే వ్యక్తి. కెరీర్ మీద ఫోకస్ పెట్టి భార్య, కొడుకుని పట్టించుకోడు. దీంతో భార్య చనిపోతుంది, కుమారుడు హాస్టల్‌లో సూసైడ్ చేసుకుంటాడు. ప్రభు ఒంటరిగా మిగిలి, రెస్టారెంట్లలో లైవ్ సింగర్‌ గా పని చేస్తూ బతుకుతాడు, తర్వాత ఆది మ్యూజిక్ బ్యాండ్‌ తో జాయిన్ అవుతాడు. జాబ్ లెస్ విక్కీ తన చిన్ననాటి స్నేహితుడు జాఫర్‌ తో ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. ఒక ప్రాంక్‌లో వీణను కలుస్తాడు. ముందు ఆమె విక్కీని అపార్థం చేసుకుంటుంది. కానీ తర్వాత విక్కీ సింప్లిసిటీ, నిజాయితీకి ఇంప్రెస్ అయి ప్రేమలో పడుతుంది. విక్కీ చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటంతో ఆమె ప్రేమను అంగీకరించలేడు. విక్కీ గతం ఏమిటి? ప్రభు లైఫ్ లో వచ్చిన ఊహించని టర్న్ ఏంటి ? క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఏంటి ? అన్నది స్టోరీ.

విశ్లేషణ

Advertisement

ఒంటరితనంతో బాధ పడుతున్న ముగ్గురు వ్యక్తులు లైఫ్ లో ఏం సాధించారు ? అన్నదే ఈ మూవీ స్టోరీ. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. మూడు కారక్టర్స్ కథని ప్యారలాల్ నడిపిస్తూ, కథను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా, ఎమోషనల్, ఫీల్ గుడ్ మూవీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పృధ్వీ పేరేచర్ల. సెకండాఫ్ లో కథ ఎమోషనల్ గా మారుతుంది. ఒక్కొక్కరి బ్యాక్ డ్రాప్ ను రివీల్ చేస్తూ ఎంగేజింగ్ గా ఉంచగలిగారు. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్టాఫ్ లో ఇంట్రడ్యూస్ చేసిన కారక్టర్స్ అన్నీ కూడా సెకండాఫ్ స్టోరీని చివరి వరకూ నడిపించడం. ఫస్టాప్ తో పోలిస్తే సెకండాఫ్ బెటర్ అన్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ తో కథకు ఎండ్ కార్డు వేశారు. ఎమోషనల్ డ్రామా ఎక్కువ కావడం, యాక్షన్ లేదా హై-వోల్టేజ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి కొంతమందికి బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని సీన్లను సాగదీశారు.

నటీనటుల విషయానికొస్తే… డెబ్యూ హీరోనే అయినప్పటికీ మురళీ కృష్ణంరాజు విక్కీ పాత్రలో బాగానే నటించాడు. ఇక హీరోయిన్ శృతి శెట్టి తెరపై బాగుంది. చాలా రోజుల తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ ఆనంద్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ తో ఆకట్టుకుంది. ప్రభు, రాకేశ్ మాస్టర్, మణిబామ్మతో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బాగ్రౌండ్ స్కోర్ పరవాలేదు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే కంటెంట్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ప్లస్ పాయింట్స్

Advertisement

సెకండాఫ్
నటీనటుల పర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్ ట్విస్ట్

కామెడీ

మైనస్ పాయింట్స్

కొన్ని సీన్లు స్లోగా సాగడం
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ప్రొడక్షన్ వాల్యూస్

మొత్తానికి

ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడేవారు అంచనాలు లేకుండా ఓసారి లుక్కేయొచ్చు.

Sky movie Review Rating 2/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×