E-Paper
Advertisement

Mr Work From Home Review: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ రివ్యూ

Mr Work From Home Review: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ రివ్యూ
Advertisement

Mr Work From Home Review : తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవలి కాలంలో సామాజిక అవగాహన, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలను డిఫరెంట్ యాంగిల్‌తో చూపించే చిత్రాలు వస్తున్నాయి. ఆ కోవలో మధుదీప్ చెలికాని దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ కూడా అలాంటి ప్రయత్నమే. ట్రైలర్, పాటలు, టీజర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ సినిమా, టైటిల్‌తోనే ప్రేక్షకుల అంచనాలను పెంచింది. ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ

అమెరికాలో హై-ప్రొఫైల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తాడు అరవింద్ (త్రిగుణ్). స్వదేశం వచ్చి, సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటాడు. రసాయన ఎరువుల వల్ల భూములు నిస్సారమవడం, ఆహారం ద్వారా వస్తున్న ఆరోగ్య సమస్యలను గమనించి ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతాడు. దీనికి తోడుగా రైతుల ఆదాయం పెంచడానికి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే ఇన్నోవేటివ్ యాప్‌ను తీసుకువస్తాడు. ఈ ప్రయాణంలో మహి (పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమ కథ కూడా నడుస్తుంది. కానీ ఉద్యోగం లేదన్న కారణంతో మహి అతన్ని దూరం చేస్తుంది. అరవింద్ తన ఆలోచనలతో రైతుల జీవితాలను మార్చగలడా ? ప్రేమలో సక్సెస్ అవుతాడా ? అనేది సినిమా కథ.

విశ్లేషణ

Advertisement

మధుదీప్ చెలికాని టైటిల్ ద్వారానే ఆసక్తి రేకెత్తించాడు. రసాయన ఎరువుల వల్ల వస్తున్న హాని, సాంప్రదాయ వ్యవసాయం ప్రాముఖ్యత, మిల్లెట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి విషయాలను చాలా బాగా చెప్పారు. ప్రస్తుత సమాజంలో ఉన్న ఆరోగ్య సమస్యలకు మూలం చూపించడం సినిమా బలం. ఇందులో మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను బాగా ఎలివేట్ చేశాయి. విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫీల్డ్ సీన్స్, గ్రామీణ ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి. సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్గానిక్ వ్యవసాయం, రైతు సమస్యల గురించి ఆలోచింపజేసే కంటెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్‌ను స్మార్ట్‌గా కనెక్ట్ చేయడం వంటి అంశాలు సినిమాకు బలాన్ని చేకూర్చాయి. స్క్రీన్‌ప్లే, రొటీన్ లవ్ స్టోరీ, కొన్ని సాగదీసిన సీన్స్‌ వంటివి మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే… త్రిగుణ్ తన లుక్, ఎమోషన్స్‌తో హీరోగా మెప్పించాడు. పాయల్ రాధాకృష్ణ అందంతో పాటు, నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక అవినాష్ కురువిల్లా, శివాజీ రాజా సపోర్టింగ్ క్యాస్ట్ తో తమ పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్

Advertisement

త్రిగుణ్ నటన
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
ఆర్గానిక్ వ్యవసాయం, రైతు సమస్యల గురించి ఆలోచింపజేసే కంటెంట్
వర్క్ ఫ్రమ్ హోమ్‌ను స్మార్ట్‌గా కనెక్ట్ చేయడం

మైనస్ పాయింట్స్

స్క్రీన్‌ప్లే
రొటీన్ లవ్ స్టోరీ
కొన్ని సాగదీసిన సీన్స్‌

ఫైనల్ గా
రైతుల గురించి, ఆహారం గురించి ఆలోచించాలనుకునేవాళ్లు తప్పక చూడాల్సిన మూవీ.

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×