E-Paper
Advertisement

K-drama Cashero Review : ‘క్యాషెరో ‘ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ

K-drama Cashero Review : ‘క్యాషెరో ‘ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ
Advertisement

K-drama Cashero Review : నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒరిజినల్ కొరియన్ డ్రామా ‘క్యాషెరో’. ఈ సిరీస్ డిసెంబర్ 26న రిలీజ్ అయింది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా, అన్నీ ఒకేసారి ఓటీటీలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చాయి. పాపులర్ కకావో వెబ్‌టూన్ అడాప్టేషన్ గా రూపొందిన ఈ సిరీస్ లో లీ జున్-హో (Lee Jun-ho) మెయిన్ లీడ్‌గా నటించాడు. మరి సూపర్ పవర్స్ ప్లస్ కామన్ మ్యాన్ సమస్యల మిక్స్ గా రూపొందిన ఈ సిరీస్ ఎంత వరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ 

సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన కంగ్ సాంగ్-ఉంగ్ (లీ జున్-హో)కి అకస్మాత్తుగా సూపర్ పవర్ వస్తుంది. చేతిలో ఎంత క్యాష్ ఉంటే అతని బలం అంతే పెరుగుతుంది. కానీ పవర్ ఉపయోగించిన ప్రతిసారీ ఆ డబ్బు గాలిలో కలిసిపోతుంది. ఇల్లు కొనడం, పెళ్లి ఖర్చులు వంటి సాధారణ సమస్యలతో డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న హీరో… మధ్యలో సూపర్‌ హీరో అవతారం ఎత్తాల్సి వస్తుంది. పైగా దానికి కూడా డబ్బు ఖర్చవుతుంది. మిగతా పాత్రలు కూడా విచిత్రమైన పవర్స్ తో ఉంటాయి. అంటే ఆల్కహాల్ తాగితే పవర్, ఎంత ఎక్కువ తింటే అంత పవర్ అలాగన్నమాట. ఇక ఈ కామన్ సూపర్ హీరోలు అందరూ కలిసి సాధారణ ప్రజల జీవితాలను రక్షించేందుకు విలన్స్‌ తో పోరాడతారు. ఇంతకీ ఇందులో విలన్ ఎవరు? డబ్బు అయిపోయినప్పుడు హీరో పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది? అన్నది స్టోరీ.

వివరణ

Advertisement

ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ చాలా యూనిక్ అని చెప్పాలి. డబ్బుతో పవర్, రియల్ లైఫ్ సమస్యలతో సూపర్‌ హీరో స్టోరీ అన్నది ప్లస్ పాయింట్. మార్వెల్ స్టైల్ గ్రాండ్ హీరోలు కాదు గానీ సాధారణ మనిషి డబ్బు ఖర్చు పెట్టి ప్రపంచాన్ని కాపాడే స్టోరీ. హ్యూమర్, ఎమోషన్, యాక్షన్ మిక్స్ అయ్యి ఉండడంతో సిరీస్ ప్రతీ కామన్ మ్యాన్ కు కనెక్ట్ అవుతుంది. హీరో లీ జున్-హో నటన సూపర్. విజువల్స్… ముఖ్యంగా డబ్బు గాలిలో ఎగిరే సీన్స్,  VFX బాగున్నాయి. కానీ స్టోరీ టెల్లింగ్‌లో మేకర్స్ తడబడ్డారు. ఒరిజినల్ వెబ్‌టూన్ కు అడాప్టేషన్ అయిన ఈ సిరీస్ లో కథను చాలావరకు మార్చారు. దీంతో కథలో ఒరిజినల్ ఎసెన్స్ పోయింది. పేసింగ్ అక్కడక్కడ స్లో అవ్వడం, సీరియస్ నుండి కామెడీకి టోన్ షిఫ్ట్స్ వంటివి మైనస్ పాయింట్స్. సీరియస్, కామెడీ మధ్య బ్యాలెన్స్ లేదు. అలాగే సిరీస్ 8 ఎపిసోడ్లు ఉన్నప్పటికీ తక్కువ రన్ టైమ్ ఉండడం మరో ప్లస్ పాయింట్. 8 ఎపిసోడ్స్ ను వన్ సిట్టింగ్‌లో చూడొచ్చు. మొత్తానికి ‘క్యాషెరో’ ఫ్రెష్ సూపర్‌ హీరో సిరీస్. లీ జున్-హో ఫ్యాన్స్‌ లో ఎక్స్పెక్ట్షన్స్ తో మస్ట్ వాచ్. లైట్ అండ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న ఈ సిరీస్… వెబ్‌టూన్ చదివిన వాళ్లని నిరాశ పరిచే ఛాన్స్ ఉంది.

ప్లస్ పాయింట్స్

యూనిక్ కాన్సెప్ట్
నటీనటుల యాక్టింగ్
కామెడీ
విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్
ఎపిసోడ్స్ రన్ టైమ్

మైనస్ పాయింట్స్

Advertisement

వెబ్‌టూన్ స్టోరీని మార్చడం
సాగదీత

చివరగా 

సిరీస్ వన్ టైమ్ వాచ్‌కి బాగుంది. అంచనాలు లేకుండా చూస్తే పక్కా ఆకట్టుకుంటుంది.

K-drama Cashero Review and Rating : 2.5/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×