E-Paper
Advertisement

Laggam Time Review: ‘లగ్గం టైమ్’లో నవ్వులు ఎలా పూశాయో తెలుకోవాలంటే.. ఈ రివ్యూ చదవాల్సిందే..

Laggam Time Review: ‘లగ్గం టైమ్’లో నవ్వులు ఎలా పూశాయో తెలుకోవాలంటే.. ఈ రివ్యూ చదవాల్సిందే..
Advertisement
  • సినిమా : లగ్గం టైమ్
  • నటీనటులు : రాజేష్ మేరు, నవ్య చిట్యాల, నెల్లూరు సుధర్శన్ తదితరులు.
  • దర్శకత్వం : ప్రజోత్ కె వెన్నం
  • నిర్మాత : కె. హిమ బిందు
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 6, 2026

Laggam Time Review: ఫిబ్రవరి 6, 2026న విడుదలైన ‘లగ్గం టైమ్’ చిన్న చిత్రంగా వచ్చి పెద్ద నవ్వులు పూయిస్తోంది. దర్శకుడు ప్రజోత్ కె వెన్నం ఒక సాదాసీదా పెళ్లి కథను తనదైన కామెడీ ట్రీట్‌మెంట్‌తో ఎలా రక్తికట్టించారో ఈ రివ్యూలో చూద్దాం.

Read also-Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!

కథేంటంటే..

Advertisement

కథ మొత్తం ఒకే ఒక పెళ్లి మండపం చుట్టూ తిరుగుతుంది. సూర్య (రాజేష్ మేరు) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తన ఊరిలో జరిగే ఒక పెళ్లికి వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు (నవ్య చిట్యాల)తో సూర్యకు పాత పరిచయం, ప్రేమ ఉంటాయి. అయితే, సరిగ్గా ముహూర్తానికి కొద్ది గంటల ముందు పెళ్లి కొడుకు అదృశ్యమయ్యాడని తెలుస్తుంది. ఈ గందరగోళం మధ్య సూర్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? పెళ్లి ఇంట్లో ఉండే రకరకాల మనస్తత్వాలు కలిగిన బంధువులు (అత్తమ్మలు, బావమరుదులు, ఊరి పెద్దలు) ఈ విషయాన్ని ఎలా రచ్చ చేశారు? చివరకు ‘లగ్గం టైమ్’కి పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.

నటీనటుల ప్రతిభ

హీరోగా రాజేష్ చాలా ఈజ్‌తో నటించాడు. ముఖ్యంగా కన్ఫ్యూజన్ సీన్స్‌లో, కామెడీ టైమింగ్‌లో తన ప్రతిభ చాటుకున్నాడు. లోకల్ కుర్రాడిగా తన డైలాగ్ డెలివరీ బాగుంది. హీరోయిన్ పాత్రకు నవ్య చక్కగా సరిపోయింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కీలక సన్నివేశాల్లో మంచి హావభావాలు పలికించింది. ఈ సినిమాకు అసలైన బలం నెల్లూరు సుధర్శన్, ప్రణీత్ రెడ్డి ప్రితి సుందర్. సుధర్శన్ మార్క్ నెల్లూరు స్లాంగ్ కామెడీ థియేటర్‌లో విజిల్స్ వేయించింది. పెళ్లి ఇంట్లో ఉండే ‘అలిగే బంధువుల’ పాత్రలు పోషించిన వారు ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతారు.

Advertisement

Read also-Balakrishna: క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు.. బాలయ్యా.. మజాకా?

సాంకేతికంగా..

ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించిన మొదటి సినిమా అయినప్పటికీ, స్క్రీన్‌ప్లేను ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు. పెళ్లి ఇంటి వాతావరణాన్ని సహజంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. పవన్ అందించిన సంగీతంలో పాటలు పర్వాలేదనిపించినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కామెడీ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఛేజింగ్ సీక్వెన్స్‌లో మ్యూజిక్ హిలేరియస్‌గా ఉంటుంది. 130 నిమిషాల నిడివి సినిమాకు పర్ఫెక్ట్. సెకండాఫ్ మొదట్లో చిన్న సాగదీత ఉన్నా, వెంటనే కామెడీతో కవర్ చేశారు. వపన్ గుంతుకు విజువల్స్ పెళ్లి కలర్ ఫుల్ సెట్టింగ్స్, లైటింగ్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. ఓవరాల్ గా సినిమా మంచి టెక్నికల్ యూనిట్ తో పర్వాలేదు అనిపించుకుంది.

బలాలు

  • న్యాచురల్ కామెడీ
  • డైలాగ్స్

బలహీనతలు

  • ఊహించే కథ
  • ప్రొడక్షన్ వాల్యూస్

అసలు ముచ్చటకు వస్తే :  Laggam Time Movie Rating :2.5/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×