E-Paper
Advertisement

Jigris Movie Review : ‘జిగ్రీస్’ మూవీ రివ్యూ

Jigris Movie Review : ‘జిగ్రీస్’ మూవీ రివ్యూ
Advertisement

Jigris Movie Review : కృష్ణా బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ అత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రల్లో రూపొందిన మూవీ ‘జిగ్రీస్’. ‘ఈ నగరానికి ఏమైంది’ తరహాలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ థియేటర్లలో శుక్రవారం నుంచి సందడి చేస్తోంది. మరి సందీప్ రెడ్డి వంగా వంటి సెన్సేషనల్ డైరెక్టర్ సపోర్ట్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ అంచనాలను అందుకుందా ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

టైటిల్ కు తగ్గట్టే కార్తీక్ (కృష్ణా బురుగుల), ప్రవీణ్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ అత్రేయ), ప్రశాంత్ (మణి వక్కా) అనే నలుగురు జిగ్రీస్ అంటే జాన్ జిగిరీ ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ స్టోరీ. 90లలో కలిసి పెరిగిన ఈ ఫ్రెండ్స్ వయసు మారినా, బంధం మాత్రం బలంగానే ఉంటుంది. ఈ నలుగురు కలిసి మారుతి 800 కారులో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ రోడ్ ట్రిప్‌కు బయలుదేరతారు. కానీ తీరా బయల్దేరాక పర్స్ పోగొట్టుకోవడం, మధ్యలో కారు ఆగిపోవడంతో కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. మరి ఇంతకీ వీళ్ళు గోవాకు ఎలా చేరుకున్నారు? అలా చేరుకోవడానికి పడ్డ పాట్లు ఏంటి? అసలెందుకు గోవాకు వెళ్ళాలి అనుకున్నారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

Advertisement

తాగిన మత్తులో తీసుకున్న నిర్ణయం పర్యవసానం నేపథ్యంలో సాగే ఈ కథలో కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. యూత్ ను ఆకట్టుకునే డైలాగులు, సీన్లు కావలసినన్ని ఉన్నాయి. ట్రిప్ మొదట్లో ఫన్, కామెడీతో సాగుతుంది. నాటుకోడి, లారీ సీన్, ఆటో, మావోయిస్ట్ సీన్స్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ట్రిప్ మధ్యలో, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా ఉంటాయి. ముఖ్యంగా ప్రశాంత్ ఇచ్చే ఎమోషనల్ టచ్ మనసును తాకుతుంది. ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ కథను కీలక మలుపు తిప్పుతుంది. అక్కడక్కడా ల్యాగ్ అన్పించినా, మూవీ ఓవరాల్ గా ఆకట్టుకుంటుంది. అలాగే విలన్ క్యారెక్టర్ వీక్ గా అన్పిస్తుంది. సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్, ఈ సినిమా దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో మెప్పించారు.

కృష్ణా బురుగుల చుట్టే కథ తిరుగుతున్నట్టు అన్పిస్తుంది. రామ్ నితిన్ సపోర్టివ్ రోల్ లో నటించడం, ధీరజ్ ఆత్రేయ నేచురల్ కామెడీ, మణి వక్కా ఎమోషనల్ రోల్ సినిమాకు హైలైట్. ఒక్కొక్కరూ తమ పాత్రల్లో జీవించారు. కమ్రాన్ మ్యూజిక్ సినిమాకి బలం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్ :

Advertisement

నటీనటులు
మ్యూజిక్
టెక్నికల్ టీం

మైనస్ పాయింట్స్ :

సాగదీసిన సన్నివేశాలు

మొత్తానికి… ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడటానికి పర్ఫెక్ట్, ఎమోషన్స్ అండ్ ఫన్ బ్యాలెన్స్డ్ రోలర్ కోస్టర్ ‘జిగ్రీస్’.

Jigris Movie Rating : 2.5/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×