// // Gayapadda Simham Twitter Review : 'గాయపడ్డ సింహం ' -->
E-Paper
Advertisement

Gayapadda Simham Twitter Review : ‘గాయపడ్డ సింహం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Gayapadda Simham Twitter Review : ‘గాయపడ్డ సింహం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Gayapadda Simham Twitter Review : ఈమధ్య సినిమాలకు డైరెక్టర్లుగా పనిచేస్తున్న చాలామంది నటులుగా ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయం అవుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన ఇప్పటికే పలు సినిమాలలో నటించి హీరోగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచీ ‘గాయపడ్డ సింహం’ పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇవాళ మేడే సందర్బంగా ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది..? తరుణ్ భాస్కర్ ఖాతాలో హిట్ సినిమా పడిందా..? మూవీ పై నెటిజన్ల స్పందన ఎలా ఉంది అన్నది ఒకసారి తెలుసుకుందాం..

డైరెక్టర్ హీరో, తరుణ్ భాస్కర్ నూతన దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం గాయపడ్డ సింహం.. ఈ సినిమాలో చిట్టి ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తరుణ్ భాస్కర్ నటన, విలన్ గా జెడీ చక్రవర్తి ఇద్దరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారని అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది. ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉంది? తరుణ్ భాస్కర్ ఖాతాలో హిట్ పడిందా? ఈ మూవీ పై పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

Advertisement

గాయపడ్డ సింహం మూవీలో తరుణ్ భాస్కర్ అద్భుతంగా నటించారు. ఆయన కామెడీ హిలరియస్ గా ఉంది. మసాలా మ్యాజికల్ స్టఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇందులో శ్రీ విష్ణు నటనకు ఫుల్లు మార్కులు పడ్డాయి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం మూవీ చాలా క్రేజీగా ఉంది. సమ్మర్ కు బెస్ట్ బ్లాస్ట్ మూవీగా ఇది ఉంటుంది. ఆడియన్స్ కి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ.. ఈ సమ్మర్ కి గట్టిగా ఈ సినిమాతో కొట్టాలి అని ఓ నెటిజను తన ట్విట్టర్ అకౌంట్ లో రాసుకోవచ్చారు..

గాయపడ్డ సింహం ఫస్ట్ అఫ్ చాలా బాగుంది.. సెకండ్ ఆఫ్ అంతగా కామెడీగా లేకపోయినా పర్వాలేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ కొంచెం సీన్లు లాగైనా సరే సినిమా మొత్తం చాలా బాగుంది అంటూ ఓ నేటిజను ట్రీట్ చేశారు.

ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు దాదాపు 30 నిమిషాల వరకు ఉంటాడు. అతని ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోయేంతవరకు ప్రతి సీను కూడా కామెడీతో కడుపుబ్బా నవ్వించేసింది.. శ్రీ విష్ణు ఈ సినిమాని పైకి లేపాడు అని చెప్పడంలో సందేహం లేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా చాలా బాగుంది. ఫన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ ఓ నేటిజను ట్వీట్ చేశారు..

మొత్తానికి గాయపడ్డ సింహం సినిమా కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ జనాలని బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతానికైతే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో తన కామెడీతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు హీరో తరుణ్ భాస్కర్. ఇప్పటివరకు అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ అవుతాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు..

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×