E-Paper
Advertisement

ఫస్ట్‌ టైం రివ్యూ..ఏలియన్స్.. కిడ్నాప్ డ్రామా.. ‘ఫస్ట్ టైం’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

ఫస్ట్‌ టైం రివ్యూ..ఏలియన్స్.. కిడ్నాప్ డ్రామా.. ‘ఫస్ట్ టైం’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?
Advertisement

First Time Movie Review: టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ క్రమంలోనే పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరభ్ ధింగ్ర హీరోగా, ‘బిగ్‌బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్రలో, హేమంత్ ఇప్పలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఫస్ట్ టైం’. వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో రూపొందిన ఈ వినూత్న చిత్రం నేడు (మే 22న) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటి?

ఈ సినిమా కథ చాలా విచిత్రమైన, ఆసక్తికరమైన టైంలైన్‌తో సాగుతుంది. 2304 ఏడీ (AD) నేపథ్యంలో ఏలియన్ల రాకతో సినిమా ప్రారంభమవుతుంది. అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది? ఆ తర్వాత సరికొత్త భారతదేశం ఏ విధంగా ఆవిర్భవించింది? అనే పాయింట్‌ను ఏలియన్లకు మానవులు వివరించే క్రమంలో కథ ముందుకు సాగుతుంది.

Advertisement

also read :‘పురుషః’ రివ్యూ..పెద్ద సినిమాలు లేని లోటును ‘పురుషః’ తీర్చిందా?…

ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన ఆద్య (అనికా విక్రమన్) చుట్టూ కథ తిరుగుతుంది. అదే కాలేజీలో చదివే రాహుల్ (శివ కుమార్) ఎలాగైనా ఆద్యను దక్కించుకోవాలని చూస్తుంటాడు. ఈ లోగా అమెరికా నుంచి వచ్చిన బావతో ఆద్యకు బలవంతంగా నిశ్చితార్థం జరుగుతుంది. ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ‘సోల్‌మేట్’ కోసం వెతికే క్రమంలో ఆమెకు ఆది (అఖిల్ సార్థక్) పరిచయమవుతాడు. వీరి పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారుతుంది. అయితే, ఊహించని మలుపుగా ఆది.. ఆద్యను కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో భూమిపై ఉన్న మనుషులంతా చనిపోతుంటారు. అసలు మనుషుల మరణానికి కారణం ఏంటి? ఆద్య, ఆదిలు మాత్రమే ఎలా బతికారు? ఈ విపత్తుకు, ఏలియన్స్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ మొత్తం కథలో సౌరభ్ ధింగ్ర పాత్ర ప్రాధాన్యత ఏంటనేది వెండితెరపైనే చూడాలి.

Advertisement

విశ్లేషణ – ఎలా ఉందంటే?

దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఎంచుకున్న పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. దాదాపు 300 ఏళ్ల తర్వాత కలియుగం అంతమైతే భూమిపై పరిస్థితులు ఎలా ఉంటాయనే ఊహే సరికొత్త అనుభూతిని ఇస్తుంది. మరీ ముఖ్యంగా, వినాశనం తర్వాత మళ్లీ మానవజాతి సృష్టికి ఒక తెలుగువాడే మూలకారకుడు కావడం అనే థాట్ ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.సినిమా మొదటి భాగంలో ఏలియన్లు, సైంటిస్టుల ప్రయోగాలు, ఆద్య లైఫ్ లైన్.. ఇలా మల్టిపుల్ లేయర్స్‌తో కథను నడిపించడం వల్ల కొంత సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపించినప్పటికీ, సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ద్వితీయార్థంలో అసలు ట్విస్టులు రివీల్ అవుతుంటే కథనం ఎంతో వేగంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది.

also read :భార్యను వేధించే సైకో భర్త కథ.. నందు ‘అగ్లీ స్టోరీ’ ఎలా ఉందంటే?

ఈ చిత్రంలో ఎక్కడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకుండా, కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ (Human Intelligence) మరియు సొంత గ్రాఫిక్స్ నైపుణ్యంతోనే విజువల్స్ రాబట్టడం విశేషం. పరిమిత బడ్జెట్‌లోనే హేమంత్ ఇప్పలపల్లి తన వీఎఫ్ఎక్స్ అనుభవాన్ని ఉపయోగించి హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్ ఇచ్చారు.

నటీనటుల ప్రదర్శన

హీరోగా పరిచయమైన తొలి సినిమానే అయినా సౌరభ్ ధింగ్ర, చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లూక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు.అనికా విక్రమన్ గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. సినిమాకు ఈమె పెర్ఫార్మెన్స్ పెద్ద అసెట్.అఖిల్ సార్థక్ ఆది పాత్రలో అఖిల్ సార్థక్ జీవించేశాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న వేరియేషన్‌ను చాలా ఈజ్‌తో పండించాడు.అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, మైమ్ గోపి, గాయత్రి గుప్తా తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.

సాంకేతిక విభాగం

సినిమాకు ప్రధాన బలం సాంకేతిక విలువలనే చెప్పాలి. వేణు మురళీధర్, రామ్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. భవిష్యత్ ప్రపంచాన్ని కెమెరాలో చూపించిన విధానం బాగుంది. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సైన్స్ ఫిక్షన్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

చివరిగా 

‘ఫస్ట్ టైం’.. తెలుగు వెండితెరపై సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఒక సిన్సియర్ సైన్స్ ఫిక్షన్ ప్రయత్నం. థ్రిల్స్ ఇష్టపడేవారు అస్సలు మిస్ కాకూడదు!

First Time Movie Review and Rating : 2.75/5

also read :రమణి కళ్యాణం రివ్యూ..పాజిటివ్ బజ్ అనుకుంటే.. థియేటర్లో సీన్ రివర్స్ అయిందిగా!

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×