// // Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్ 2’లో ఆదిత్యధర్ మ్యాజిక్ పనిచేసిందా?.. ఫుల్ రివ్యూ.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్ 2’లో ఆదిత్యధర్ మ్యాజిక్ పనిచేసిందా?.. ఫుల్ రివ్యూ..

Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్ 2’లో ఆదిత్యధర్ మ్యాజిక్ పనిచేసిందా?.. ఫుల్ రివ్యూ..
Advertisement

కథా..

Dhurandhar 2 Review: మొదటి భాగంలో జస్కిరత్ సింగ్ రంగీ అనే భారతీయ అండర్ కవర్ ఏజెంట్, పాకిస్థాన్ అండర్‌వరల్డ్‌లోకి హంజా అలీ మజారీగా ఎలా ప్రవేశించాడో చూశాం. ఈ రెండో భాగం అక్కడి నుంచే మొదలవుతుంది. 26/11 దాడులకు కారణమైన వారిపై పగ తీర్చుకోవడమే హంజా లక్ష్యం. కరాచీ మాఫియాలో కీలక వ్యక్తిగా ఎదిగి, భారత్‌కు వ్యతిరేకంగా పన్నే కుట్రలను అతను ఎలా అడ్డుకున్నాడనేదే ఈ చిత్ర కథ.

విశ్లేషణ..

దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాను భారీ స్థాయిలో, సుమారు 4 గంటల నిడివితో (3 గంటల 49 నిమిషాలు) తెరకెక్కించారు. అయితే, మొదటి భాగంలో ఉన్న వేగం, ఉత్కంఠ ఈ సీక్వెల్‌లో కొంత తగ్గాయని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. రణవీర్ సింగ్ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. హంజా పాత్రలో అతని తీవ్రత, భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అతని బ్యాక్‌స్టోరీ చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా (రెహ్మాన్ డకైత్) పండించిన స్టైలిష్ విలనిజం ఈ సినిమాలో లోపించిందని చెప్పవచ్చు. ఈ సినిమా అత్యంత హింసాత్మకంగా ఉంది. తలలు నరకడం, దారుణంగా కొట్టడం వంటి దృశ్యాలు సెన్సార్ బోర్డు కోత విధించినా ఇంకా ఎక్కువే ఉన్నాయి. యాక్షన్ ఘట్టాలు బాగున్నా, కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపిస్తాయి. మొదటి భాగంలో ప్రోపగాండా ఉన్నప్పటికీ, కథనం చాలా వేగంగా ఉండేది. కానీ రెండో భాగంలో మొదటి సగం కొంత నెమ్మదిగా సాగుతుంది. విరామం తర్వాత కథలో వేగం పెరిగినా, క్లైమాక్స్ ట్విస్ట్ మినహా మిగిలిన భాగం అంతగా ఆశ్చర్యపరచదు. సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం టాప్ క్లాస్‌లో ఉన్నాయి. అయితే పాటల విషయంలో మొదటి భాగం స్థాయిలో మెప్పించలేకపోయాయి.

ప్లస్ పాయింట్లు

  • రణవీర్ సింగ్ నటన
  • యాక్షన్ సీక్వెన్సులు
  • క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్.

మైనస్ పాయింట్లు

  • సుదీర్ఘమైన నిడివి
  • మితిమీరిన హింస
  • మొదటి భాగంతో పోలిస్తే పట్టు కోల్పోయిన కథనం
Advertisement

 

మొత్తానికి.. ‘ధురందర్ 2’ కేవలం రణవీర్ సింగ్ నటన కోసం భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారి కోసం మాత్రమే అని చెప్పవచ్చు. మొదటి భాగం కలిగించిన ఇంపాక్ట్‌ను ఈ సీక్వెల్ పూర్తిస్థాయిలో రీప్లేస్ చేయలేకపోయింది.

Advertisement

 

రేటింగ్ – 2 / 75

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×