E-Paper
Advertisement

Blood Roses Review: క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజెన్’ ప్రేక్షకులను మెప్పించిందా?… ఫుల్ రివ్యూ..

Blood Roses Review: క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజెన్’ ప్రేక్షకులను మెప్పించిందా?… ఫుల్ రివ్యూ..
Advertisement

Blood Roses Review: దర్శకుడు మందాటి గురురాజన్ తెరకెక్కించిన ఈ చిత్రం, హైదరాబాద్ నగరంలో జరిగే వరుస హత్యల చుట్టూ తిరిగే ఒక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజెస్’ (blood reses). ధర్మ కీర్తిరాజ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథాంశం..

హైదరాబాద్ నగరం ఒక వింతైన సీరియల్ కిల్లింగ్స్‌తో వణికిపోతుంటుంది. జరిగే ప్రతి హత్యలోనూ ఒకే తరహా పాశవికత, బాధితుల శరీరం నుండి ఒక నిర్దిష్టమైన అవయవం మాయమవ్వడం పోలీసులను తలపట్టుకునేలా చేస్తుంది. ఈ కేసును ఛేజ్ చేసే బాధ్యతను హీరో (ధర్మ కీర్తిరాజ్) తీసుకుంటాడు. అసలు ఈ కిల్లర్ ఎవరు? ఎందుకు కేవలం ఆ అవయవాలనే టార్గెట్ చేస్తున్నాడు? ఈ మారణహోమం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనేదే మిగిలిన కథ.

Advertisement

Read also-Vijay Thalapathy: విజయ్ మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు.. రూ.1.5 కోట్ల జరిమానా?

విశ్లేషణ

ధర్మ కీర్తిరాజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తన బాడీ లాంగ్వేజ్, కమాండింగ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను భుజాన వేసుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లలో మెప్పించాడు. హీరోయిన్ పాత్రలో అప్సర రాణి కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తూ, కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా ఎమోషనల్ డెప్త్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సుమన్, జీ.ఎం.ఆర్ జబర్దస్త్, ఘర్షణ శ్రీనివాస్ వంటి అనుభవం ఉన్న నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దర్శకుడు గురురాజన్ రాసుకున్న స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా హత్యల వెనుక ఉన్న మిస్టరీని రివీల్ చేసే క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు బాగున్నాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ, విజువల్స్ మూడ్ సెట్టింగ్ పట్ల దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తుంది.

Advertisement

సినిమా ప్రారంభం నుండి చివరి వరకు కిల్లర్ ఎవరనే ఉత్కంఠను కొనసాగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. హై-ఆక్టేన్ యాక్షన్ సీన్లు థ్రిల్లర్ ప్రియులను అలరిస్తాయి. హైదరాబాద్ లోకల్ లొకేషన్లలో షూట్ చేయడం వల్ల కథకు నేటివిటీ తోడై సినిమాకు బలాన్ని అందించాయి. కానీ బడ్జెట్ పరిమితుల వల్ల కొన్ని చోట్ల VFX, మేకింగ్ క్వాలిటీ సాధారణంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఉండటం వల్ల క్రైమ్ సీన్లు, వయలెన్స్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించవచ్చు. కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది.

Read also-Anaganaga oka Raju OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన అనగనగా ఒక రాజు.. ఎప్పుడు ఎక్కడంటే?

బలాలు

  • సస్పెన్స్ ఎలిమెంట్
  • యాక్షన్
  • నేపథ్యం

బలహీనతలు

  • ప్రొడక్షన్ వాల్యూస్
  • వయలెన్స్

అసలు ముచ్చటకు వస్తే :  Blood Roses Movie Rating :1.75/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×