E-Paper
Advertisement

పరమపద సోపానం రివ్యూ.. బిగ్ బాస్ అర్జున్ అంబటి రివేంజ్ డ్రామా ఎలా ఉందంటే?

పరమపద సోపానం రివ్యూ.. బిగ్ బాస్ అర్జున్ అంబటి రివేంజ్ డ్రామా ఎలా ఉందంటే?
Advertisement

Paramapada Sopanam Review: బుల్లితెర నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మరింత ఆదరణ సొంతం చేసుకున్న అర్జున్ అంబటి తాజాగా పరమపద సోపానం(Paramapada Sopanam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేడు( ఏప్రిల్24న) విడుదల అయింది. మిస్టరీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? ఈ సినిమా కథ ఏంటి? అనే విషయానికి వస్తే..

కథ:

ఈ సినిమా పాలకడలి అనే గ్రామం నేపథ్యంలో కొనసాగుతుంది. సిటీలో హెల్త్ కమిషనర్ హత్యకు గురి కావడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఇక ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయటం కోసం అశ్వద్ధామ అనే పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతారు. అయితే ఈయన ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి బాడీ మీద నెక్స్ట్ చనిపోయే పోయే వ్యక్తి వేలిముద్రలు దొరకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక హీరో అర్జున్ (అర్జున్ అంబటి) ఒక గేమ్ డిజైనర్ గా కనిపిస్తారు. కానీ ఈయన PTSD అనే జబ్బుతో బాధపడుతుంటారు. ఈ జబ్బు కారణంగా తనని ఎవరో చంపడానికి వస్తున్నారనే భయంలో ఉంటారు. ఇలా జరుగుతున్న హత్యలకు అర్జున్ కు ఏదైనా సంబంధం ఉందా? ఆ పాల కడలి గ్రామం వెనుక ఉన్న రహస్యం ఏంటీ? ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

Advertisement

ఈ సినిమా దర్శకుడు నాగశివ పూరి జగన్నాథ్ శిష్యుడు కావడంతో ఆయన మార్క్ స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. మొదటి సినిమాతోనే ఒక సీరియస్ సోషల్ ఎలిమెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కమర్షియల్ మీటర్ ఎక్కడ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా ప్రతి మాట కాస్త సాగదీసినట్టు అనిపించిన, ఎప్పుడైతే హత్యలు మొదలవుతాయో అప్పటినుంచి కథ చాలా ఆసక్తికరంగా సస్పెన్స్ గా కొనసాగుతూ వచ్చింది. ఈ సినిమాలో మహబూబ్ బాషా కామెడీ వర్కౌట్ అయింది. ఇక ఇంటర్వెల్ ఇచ్చే సెకండ్ హాఫ్ మీద చాలా ఆసక్తిని కలిగించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఈ సినిమా ఎంతో ఆసక్తిగా కొనసాగడమే కాకుండా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు, ఐటమ్ సాంగ్స్ మరోవైపు కమర్షియల్ ఫైట్స్ ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా రెయిన్ ఫైట్ మాత్రం దద్దరిల్లిపోయింది.

నటీనటుల పనితీరు:

Advertisement

అర్జున్ అంబటి ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో అదరగొట్టారని చెప్పాలి. మరోవైపు హీరోయిన్ జెనీఫర్ పోలీస్ పాత్రలో నటిస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రను కూడా అద్భుతంగా బ్యాలెన్స్ చేసింది. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా వారి పాత్రలకు ప్రాణం పెట్టారు.

ప్లస్ పాయింట్స్:

*అర్జున్ అంబటి
*ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ ట్విస్ట్
*మహబూబ్ బాషా కామెడీ టైమింగ్
*టెక్నికల్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:

*కథ స్లోగా ప్రారంభం కావటం
*అక్కడక్కడ రొటీన్ ఎలిమెంట్స్

చివరిగా చెప్పాలంటే:

పరమపద సోపానం సినిమా టైటిల్ కు అనుగుణంగానే సస్పెన్స్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని కలిగించి వారికి కావలసినంత ఫుల్ మీల్స్ ఇచ్చిందని చెప్పాలి. ఎలాంటి కొత్త సినిమాలు లేక థియేటర్ లు వేలవెలబోతున్న సమయంలో పరమపద సోపానం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా నిలిచింది.

రేటింగ్: 2.5/5

Also Read: రెండేళ్లుగా అన్నం తినటం మానేసిన నటుడు.. ఆ సమస్యలే కారణమా?

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×