E-Paper
Advertisement

Bandwaale Review : ‘బ్యాండ్ వాలే’ రివ్యూ… షాలిని పాండే సిరీస్ ఎలా ఉందంటే ?

Bandwaale Review : ‘బ్యాండ్ వాలే’ రివ్యూ… షాలిని పాండే సిరీస్ ఎలా ఉందంటే ?
Advertisement

Bandwaale Review : అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన హిందీ మ్యూజికల్ డ్రామెడీ వెబ్ సిరీస్ ‘బ్యాండ్ వాలే’. సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలు నడుస్తుంది. అక్షత్ వర్మ – అంకుర్ తివారి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో షాలిని పాండే, స్వనంద్ కిర్కిరే, జహాన్ కపూర్, ఆశిష్ విద్యార్థి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కౌసర్ మునీర్ కవితలు సిరీస్‌లే ప్రధానంగా తెరకెక్కిన ఈ సిరీస్ తో షాలిని తన అభిమానులను ఆకట్టుకుందా ? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.

కథ

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ అనే చిన్న పట్టణంలో సిరీస్ స్టోరీ సాగుతుంది. మలయాళి క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి మరియం (శాలిని పాండే). అలాగే ఆమె కవయిత్రి. ఆమె తండ్రి డేవిడ్ (ఆశిష్ విద్యార్థి) కాలేజీ ప్రిన్సిపల్, చాలా కఠినంగా ఉండడమే కాదు ఆయన సాంప్రదాయవాది. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే కూతురిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తాడు. చిన్న పట్టణంలో మహిళలకు కెరీర్ లేదు, పెళ్లి మాత్రమే గమ్యం అనేది ఆయన నమ్మకం. దీంతో మరియం తన కవితలను వేరే కలం పేరుతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, డిజిటల్ స్పేస్ ద్వారా మంచి గుర్తింపు పొందాలని కలలు కంటుంది. బ్రాస్ బ్యాండ్ సింగర్ రోబో (స్వనంద్ కిర్కిరే), DJ సైకో (జహాన్ కపూర్). ఇద్దరూ ఈ విషయంలో ఆమెకు సాయం చేస్తారు. మరి హీరోయిన్ కలలు కన్నట్టుగానే మంచి కవయిత్రిగా పేరు తెచ్చుకుందా ? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించింది ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ

Advertisement

మ్యూజికల్ డ్రామెడీగా తీసిన ఈ సిరీస్ ను స్నేహం, ఆర్టిస్టిక్ స్వేచ్ఛ వంటి థీమ్ లను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. పాటలు, కవితలు (కౌసర్ మునీర్) బాగానే బాగున్నాయి. కానీ స్టోరీ స్లోగా, ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. ఇక హీరోయిన్ ఎదుర్కొనే సమస్యలు ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి, సబ్‌ప్లాట్స్ స్టోరీకి సంబంధం లేకుండా ఉన్నాయి. రొమాన్స్ ఫోర్స్డ్ గా అన్పిస్తుంది. కామెడీ అస్సలు పండలేదు. క్లైమాక్స్ చాలా కన్వీనియంట్‌ గా ఉంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే మైల్డ్ ఎంటర్‌టైనర్ కానీ మెమరబుల్ కాదు. ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో ఆడియన్స్ సిరీస్ కు ఎంగేజ్ అవ్వడం కష్టం. నటీనటుల విషయానికొస్తే.. స్వనంద్ కిర్కిరే (రోబో) పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కానీ ఆయన క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ. అయినప్పటికీ అతనే షో స్టీలర్ అని చెప్పవచ్చు. శాలిని పాండే, జహాన్ కపూర్ తదితరులు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్

Advertisement

మ్యూజిక్
స్వనంద్ కిర్కిరే (రోబో) పెర్ఫార్మెన్స్
ఫ్రెష్ యాక్టర్స్‌

మైనస్ పాయింట్స్

సాగదీసిన స్టోరీ
ఫోర్స్డ్ రొమాన్స్
పేలని కామెడీ
క్లైమాక్స్
.
మొత్తానికి : 

మ్యూజికల్ డ్రామా, పోయెట్రీ థీమ్ ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయవచ్చు.

Bandwaale Review Rating :1.5/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×