// // Avatar Fire And Ash Twitter Review: 'అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ ' -->
E-Paper
Advertisement

Avatar Fire And Ash Twitter Review: ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ ‘ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్ కొట్టినట్లే..?

Avatar Fire And Ash Twitter Review: ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ ‘ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్ కొట్టినట్లే..?
Advertisement

Avatar Fire And Ash Twitter Review: వరల్డ్ పాపులర్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌ తెరకెక్కించిన అవతార్ మూవీ కి హాలీవుడ్ లో మాత్రమే కాదు.. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.. అవతార్, అవతార్ 2 లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు అవతార్ 3 థియేటర్లలోకి వచ్చేసింది.. భారీ అంచనాలతో ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది.. మొదటి రెండు పార్ట్ ల కంటే ఈ పార్ట్ మంచి టాక్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇప్పటికే పడ్డ ప్రీమియర్ షోలపై మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ప్రీమియర్స్ చూసిన వాళ్లు సినిమాపై సోషల్ మీడియాలో ఎలా స్పందింస్తున్నారో.. ఈ ట్విట్టర్ (X) రివ్యూలో ఒకసారి తెలుసుకుందాం.

ఇంటర్‌స్టెల్లార్ తర్వాత నేను చూసిన వాటిలో ఇది నిస్సందేహంగా అత్యుత్తమమైనది. చాలా కాలంగా ఏ సినిమాలోనూ నేను ఏడవలేదు.. ఈ మూవీ నన్ను బాగా ఏడ్పించేసింది.. ఆస్కార్స్‌లో ఉత్తమ చిత్ర అవార్డు విజేతగా దీనిని ఎంచుకోవడం చాలా సులభం. నేను ఈ సినిమాను ఐమ్యాక్స్‌లో చూశాను మళ్లీ మళ్లీ ఈ సినిమాని చూడాలనిపిస్తుంది. మళ్లీ నేను చూస్తాను.. అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ చిత్రంలో విజువల్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఉత్కంఠ భరితంగా సాగే స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను చూపుతిప్పుకోనివ్వదని తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ హంగామా ఈ సినిమాకు 3.5 స్టార్స్ ఇచ్చింది.. ఇప్పటివరకు ఇలాంటి రివ్యూలు ఎక్కడ రాలేదు. దాదాపు 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో ఉంది. అంతసేపు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంటే కత్తిమీద సామే అని చెప్పొచ్చు. కానీ అవతార్ 2 కూడా ఇంచుమించు ఇదే రన్ టైమ్ ఉంటుంది.. ఈ సినిమా మొత్తం బాగుందని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తున్నారు..

Advertisement

అవతార్ 3 సినిమా చాలా బాగుంది.. సినిమా విజువల్ వండర్ గా చాలా బాగుంది. ప్రతి సీన్ అద్భుతంగా ఉంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ చిత్రాన్ని ఈ రాత్రి థియేటర్లలో మాత్రమే చూడండి.. చాలా బాగుంటుందని మరో నెటిజన్ ట్వీట్ చేశారు..

జేమ్స్ కెమెరూన్ మరోసారి అద్భుతం చేశాడు. అవతార్ 3 ఒక సినిమా కాదు… ఇది సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. ఈసారి పండోరా మరింత చీకటిగా, అగ్నిగోళంగా మారుతుంది.. మళ్లీ ఆ అద్భుతమైన దృశ్యాలను చూస్తున్నారు. ఫస్టాఫ్‌లో కొంత లాగ్ అనిపించి నిడివి ఎక్కువగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం బాగుంది. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి.

మొత్తానికి ఈ మూవీ విజువల్ వండర్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. అవతార్ 3 కు తక్కువ రేటింగ్ అండ్ రివ్యూస్ ఇచ్చాయి. రోటెన్ టమాటోస్ ఈ మూవీకి 69 శాతం మాత్రమే ఇచ్చింది. ఈ రేటింగ్ అవతార్, అవతార్ 2 కంటే తక్కువ.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 బిలియన్ డాలర్లతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.. మొదటి నుంచి సినిమా బాగానే ఉందని టాక్ ను అందుకుంది.. క్లైమాక్స్ భారీగా, బోల్డ్‌గా, ఎమోషనల్‌గా బరువెక్కిస్తుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సంగీతం విజువల్స్‌కు తగినట్లుగా సరిపోయింది. భావోద్వేగం సన్నివేశాలను మరింత రక్తి కట్టిస్తుంది. ప్రతి ఒక్క సీన్ కూడా ఈ సినిమాకు బాగా ఉందని నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు.. మొత్తానికైతే రివ్యూలు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ని అందిస్తున్నాయి.. ఇప్పటివరకు పడిన షోలకు రెస్పాన్స్ బాగుండటంతో ఈ సినిమా మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు…

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×