E-Paper
Advertisement

Anagaanaga oka Raju Twitter Review: ‘అనగనగా ఒక రాజు’ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్ పడ్డట్లేనా..?

Anagaanaga oka Raju Twitter Review: ‘అనగనగా ఒక రాజు’ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్ పడ్డట్లేనా..?
Advertisement

Anagaanaga oka Raju Twitter Review: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు.. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా ఇవాళ థియేటర్లలోకి రిలీజ్ అయింది.. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఏ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించేందుకు వచ్చేసింది.. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై రూపొందింది..’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన మూవీ.. ఇవాళ థియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి నెటిజన్లు ఈ మూవీ పై ఎలా స్పందిస్తున్నారో ఒకసారి ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం..

నవీన్ పోలిశెట్టి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడొచ్చినా అనగనగా ఒక రాజు సినిమా కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది.. ఇప్పటివరకు ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టిపికల్ ఫెస్టివల్ సినిమాలకు ఉండే తరహా సెటప్ ఇది. అక్కడక్కడా కొన్ని తడబాట్లు ఉన్నప్పటికీ, నవీన్ తన కామెడీ టైమింగ్, వన్ లైనర్లతో సినిమాను నడిపించాడు. కొన్ని ఫన్నీ సన్నివేశాలు జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. సంక్రాంతికి ఈ సినిమా నవ్వించేస్తుంది.. సినిమాని తప్పకుండా చూడచ్చు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

అనగనగా ఒక రాజు మూవీ జనాలను బాగా ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.. ఒకటే మాట చెప్తా.. సినిమా కుమ్మేసింది. ఫస్టాఫ్ హిలేరియస్ గా ఉంది. నవీన్ వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.. సంక్రాంతికి రిలీజ్ అయిన మిగతా బ్లాక్ భారీ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బాగుంది.. అచ్చ తెలుగు పల్లెటూరు వాతావరణ ని సినిమాలో చూపించారు అంటూ ఓ ట్వీట్ చేశారు..

Advertisement

సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన అన్ని సినిమాలలో అనగన ఒక రాజు సినిమా హైలైట్ గా నిలిచింది. సంక్రాంతికి రాజు గారిదే హవా. హడావిడి, నవీన్ పోలిశెట్టి వైబ్ కనిపిస్తోంది. మీనాక్షి చౌదరీ అందంగా ఉంది. సరైన కామెడీ ట్రాక్‌లు.. ఆర్గానిక్ కామెడీ ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది కడుపుబ్బ నవ్విస్తుంది.. అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు..

అనగనగా ఒక రాజు సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయి సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. కంప్లీట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ఉంటుంది.. సినిమా అయ్యేంతవరకు నవ్వుతూనే ఉంటారు.. కామెడీ టైమింగ్ లో నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు నవీన్ పోలిశెట్టి అంటూ మరో నేటిజెన్ ట్వీట్ లో తన అభిప్రాయాన్ని తెలిపారు..

నవీన్ పోలిశెట్టి ఇప్పటివరకు చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అన్న విషయం తెలిసిందే.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీమియర్ షో లతో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఒక మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది జనాలను బాగా ఆకట్టుకుంటుంది అనే టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఈ సంక్రాంతి విన్నర్గా ఈ సినిమా రేసులో నిలబడుతుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా కలెక్షన్లు ఎంత వసూలు చేస్తుందో తెలిసే వరకు వెయిట్ చేయాలి…

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×