E-Paper
Advertisement

Decoit Movie Twitter Review : ‘ డెకాయిట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Decoit Movie Twitter Review : ‘ డెకాయిట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Decoit Movie Twitter Review : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేషు, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న భారీ అంచనాలతో థియేటర్లలోకి రానుంది.. ఈ క్రమంలో ఇవాళ ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. డిఫరెంట్ జోనర్ లో వచ్చిన చిత్రం కావడంతో జనాలు ఈ మూవీకి మంచి రెస్పాన్స్ ని అందిస్తున్నారని తెలుస్తుంది.. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరి ఈ సినిమాకు జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం ఒకసారి చూసేద్దాం..

గతంలో ఈ హీరో నటించిన ప్రతి మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ను అందించాయి.. మేజర్ తర్వాత అడివి శేష్ నటిస్తున్న మూవీ కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా డెకాయిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు కీలక పాత్రలో నటించారు.. ప్రీమియర్ షోలతో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. మరి ఈ మూవీ పై ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది..? నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం..

Advertisement

అడవి శేషు సినిమాలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సినిమాని చూసేందుకు అందరు స్టార్ హీరోలు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు దానికి రీ ట్వీట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమాని ఒకరు సినిమాపై ట్వీట్ చేశారు.. అందులో ఏముంది.. మా ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకి ట్వీట్ చేశారంటే సినిమా ఎలా ఉన్నా పర్లేదు బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అంటూ అందులో రాసి ఉంది..

Advertisement

ఇప్పటివరకు అందుతున్న సమాచారం పబ్లిక్ టాక్ ని బట్టి చూస్తే సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇదే రెస్పాన్స్ కనుక రేపు కూడా వస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు ఏమంటూ పలువురి నెటిజెన్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.. మరి కలెక్షన్స్ ఈ సినిమాకు ఏ మాత్రం వసూలు అవుతాయో చూడాలి..

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×