E-Paper
Advertisement

A Knight of the Seven Kingdoms Review : ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్’ సిరీస్ రివ్యూ

A Knight of the Seven Kingdoms Review : ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్’ సిరీస్ రివ్యూ
Advertisement

A Knight of the Seven Kingdoms Review : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫ్యాన్స్ కోసం తాజాగా ఓటీటీలోకి ప్రీక్వెల్ వచ్చింది. ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ రాసిన “డంక్ అండ్ ఎగ్” నవలల ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్‌తో (సీజన్ 1) 2025 డిసెంబర్ లో HBOలో విడుదలైంది. జనవరి 19న మొదటి ఎపిసోడ్ Jiohotstar లో రిలీజ్ అయింది.

కథ

ఇది ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా భారీ బడ్జెట్ వార్ డ్రామా కాదు. సరదాగా, ఎమోషనల్‌ గా, హార్ట్ టచింగ్ గా సాగే అడ్వెంచర్ స్టోరీ. 7 అడుగుల ఎత్తున్న సెర్ డంకన్ ది టాల్ (డంక్) అనే సాధారణ నైట్ చుట్టూ కథ తిరుగుతుంది. అతను ఒక చిన్న గ్రామం నుండి వచ్చి, నైట్ అవ్వాలని కల కంటాడు. ఒక రోజు అతను ఎగ్ (ఎగన్) అనే చిన్న అబ్బాయిని కలుస్తాడు. ఈ బాలుడు నిజానికి రాజకుమారుడు ఎగన్ టార్గారియన్. కానీ అతను ఆ విషయాన్ని సీక్రెట్ గా దాచిపెడతాడు. ఇద్దరూ కలిసి వెస్టరోస్ దేశంలో ప్రయాణిస్తూ, టోర్నమెంట్స్‌లో పాల్గొంటూ, చిన్న చిన్న అడ్వెంచర్స్‌ చేస్తూ జర్నీ చేస్తారు. మరి ఈ జర్నీలో ఏం జరిగింది ? ది టాల్ నైట్ అయ్యాడా ? అనేది తెలుసుకోవాలంటే మిగతా ఎపిసోడ్స్ వచ్చేదాకా ఆగాల్సిందే.

విశ్లేషణ

Advertisement

ఇదొక హిస్టారికల్ డ్రామా. మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉండగా, ఇప్పటికైతే ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటినుంచి ఇండియాలో ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ కానుంది. గేమ్ ఆఫ్ ప్రోన్స్ సిరీస్లో జరిగే స్టోరీ కి 100 ఏళ్ల ముందు జరిగే కథ. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 లో జరిగే స్టోరీ కి 80 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఇక మొదటి ఎపిసోడ్ లో ఫోకస్ మొత్తం మెయిన్ క్యారెక్టర్ పైనే పెట్టారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా పొలిటికల్ గేమ్స్, యుద్ధాలు, డ్రాగన్స్ కాకుండా…ఫ్రెండ్‌షిప్, గౌరవం వంటి అంశాలున్న మనసుకు హత్తుకునే స్టోరీ. డంక్ ఒక సింపుల్, హానెస్ట్, కొంచెం డల్ బట్ మంచి హార్ట్ ఉన్న నైట్. ఎగ్ మాత్రం చాలా స్మార్ట్, చాలా ధైర్యవంతుడు. ఇద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల బంధం ఈ సిరీస్ లో హైలైట్. వెస్టరోస్ లోకేషన్స్, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. రొమాన్స్ తక్కువ, హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఎక్కువ ఉన్న సిరీస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా భారీ బడ్జెట్ లేదు కానీ ప్రొడక్షన్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాంటి ఎక్స్పీరియన్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తే కష్టమే. ఎందుకంటే ఇందులో యాక్షన్ లేదు. డైలాగ్ డ్రైవెన్ స్టోరీ ఎక్కువగా ఉంది. భారీ బ్యాటిల్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళకి ఇది స్లోగా సాగుతున్నట్టు అన్పిస్తుంది. గ్రాఫిక్ వయొలెన్స్ కూడా లేదు కాబట్టి బోరింగ్ గా అన్పించే ఛాన్స్ ఉంది.

ఎపిసోడ్ 1 – 19 జనవరి, ఎపిసోడ్ 2 – 26 జనవరి, ఎపిసోడ్ 3 – ఫిబ్రవరి 2, ఎపిసోడ్ 4 – ఫిబ్రవరి 9, ఎపిసోడ్ 5 – ఫిబ్రవరి 16, ఎపిసోడ్ 6 – ఫిబ్రవరి 23న రిలీజ్ కానున్నాయి.

ప్లస్ పాయింట్స్

Advertisement

యాక్టర్స్
కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ
హార్ట్ టచింగ్ స్టోరీ
హై ప్రొడక్షన్ క్వాలిటీ

మైనస్ పాయింట్స్

యాక్షన్ లేదు
తెలుగు డబ్బింగ్

మొత్తానికి

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ రేంజ్ అంచనాలు పెట్టుకుంటే డిసప్పాయింటే.

A Knight of the Seven Kingdoms Rating : 2/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×