E-Paper
Advertisement

Simple Breakfast: రాత్రి మిగిలిన రోటీలతో ఉదయం టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రోటీ ఉప్మా .. రెసిపీ ఇదిగో

Simple Breakfast: రాత్రి మిగిలిన రోటీలతో ఉదయం టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రోటీ ఉప్మా .. రెసిపీ ఇదిగో
Advertisement

ఇంట్లో రాత్రి చేసిన రోటీలు ఉదయం మిగిలిపోవడం చాలా సాధారణం. చాలామంది ఇవి గట్టిపడిపోయాయని పారేస్తారు. కానీ మిగిలిన రోటీలతో చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ వంటకం సిద్ధమవుతుంది.

రోటీ ఉప్మా రెసిపీకి కావలసిన పదార్థాలు
మిగిలిన రోటీలు – 3 నుంచి 4
ఉల్లిపాయ – ఒకటిసన్నగా తరిగినది)
పచ్చిమిర్చి – రెండు(తరిగినవి)
క్యారెట్ తరుగు – రెండు స్పూన్లు
కరివేపాకులు – కొద్దిగా
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నిమ్మరసం – ఒక స్పూను

Advertisement

Also read: Rice Porridge: ఉదయం పూట గంజి అన్నం తిన్నారంటే మీరు ఊహించని ప్రయోజనాలు

రోటీ ఉప్మా తయారు చేసే విధానం
1. మొదట మిగిలిన రోటీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని చాలా చిన్నగా చేస్తే రుచిగా ఉంటుంది.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసాలి.
3. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి.
4. తరువాత తరిగిన ఉల్లిపాయ వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
5. కావాలంటే క్యారెట్ లేదా మీకు ఇష్టమైన కూరగాయలు కూడా వేసుకోవచ్చు.
6. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత కట్ చేసిన రోటీ ముక్కలు వేసి మెల్లగా కలుపుతూ రెండు మూడు నిమిషాలు వేయించాలి.
7. చివరగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. కావాలంటే కొద్దిగా నిమ్మరసం పిండితే మంచి రుచి వస్తుంది. రుచికరమైన రోటీ ఉప్మా సిద్ధం.

Advertisement

ఇంకో విధంగా కూడా మిగిలిన రోటీలతో బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. రోటీ ముక్కలను ఒక బౌల్‌లో వేసి కొద్దిగా పెరుగు కలపాలి. తరువాత పాన్‌లో తాలింపు వేసి ఆ మిశ్రమాన్ని వేసి కలిపితే పెరుగు రోటీ తయారవుతుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. వేసవిలో చాలా రుచిగా ఉంటుంది.

Also read: Weightloss Roti: బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని రోటీలు తినాలి? ఏ పిండితో చేసిన రోటీ తింటే మంచిది?

రోటీ రోల్ గా చేయచ్చు
మిగిలిన రోటీలను అలాగే ఉపయోగించి రోల్ కూడా చేయవచ్చు. ఒక రోటీ తీసుకుని అందులో ఉల్లిపాయ, క్యారెట్, టమాటా, చాట్ మసాలా లేదా మీకు ఇష్టమైన కూర మిశ్రమం పెట్టి రోల్‌లా చుట్టాలి. కళాయిలో వేసి కొద్దిగా వేడి చేస్తే టిఫిన్‌లా తినవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×