// // Ramadan Eid 2026: ఈద్ విందులో నోరూరించే స్పెషల్ వంటకాలివే! -->
E-Paper
Advertisement

Ramadan Eid 2026: రంజాన్ ఈద్ విందులో ఈ 4 వంటకాలు ఉండి తీరాల్సిందే!

Ramadan Eid 2026: రంజాన్ ఈద్ విందులో ఈ 4 వంటకాలు ఉండి తీరాల్సిందే!
Advertisement

Ramadan Eid 2026: రంజాన్ అనే పేరు వినగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది హలీమ్. ముఖ్యంగా హైదరాబాదీ హలీమ్ అంటే తెగ ఇష్టపడి తింటారు జనాలు. రంజాన్ నెలలో కఠిన ఉపవాస దీక్షలు ముగించుకున్న తర్వాత, ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ‘ఈద్ విందు’ కోసం ఇప్పటికే వంటల ప్రణాళికలు మొదలైపోయి ఉంటాయి. ఈ సమయంలో హైదరాబాదీ సంప్రదాయ రంజాన్ వంటకాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో రంజాన్‌కు ప్రత్యేకంగా చేసుకునే 4 ముఖ్యమైన వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షీర్ ఖుర్మా (Sheer Khurma)

రంజాన్ పండుగ ఉదయం ప్రార్థనల తర్వాత ప్రతి ముస్లిం ఇంట్లో మొదటగా వడ్డించే తీపి వంటకం షీర్ ఖుర్మా. పర్షియన్ భాషలో షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం అని అర్థం. చిక్కటి పాలలో వేయించిన సేమియా, ఎండు ఖర్జూరాలు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యితో తయారు చేసే ఈ వంటకం పండుగకు అసలైన తీపిని అందిస్తుంది. ఇది కేవలం స్వీట్ మాత్రమే కాదు, రంజాన్ అతిథులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక.

మటన్ దమ్ బిర్యానీ (Mutton Dum Biryani)

Advertisement

ఈద్ విందులో ప్రధాన ఆకర్షణ ఖచ్చితంగా మటన్ దమ్ బిర్యానీనే. బాస్మతి బియ్యం, లేత మటన్ ముక్కలు, సుగంధ ద్రవ్యాలతో కలిపి దమ్ పద్ధతిలో ఉడికించే ఈ బిర్యానీ సువాసన ఇల్లంతా నిండిపోతుంది. పెరుగు పచ్చడి (రైతా), మిర్చి కా సాలన్‌తో కలిపి తింటే ఆ రుచి అమోఘం. పండుగ రోజున విందుకు వచ్చే అతిథుల కోసం ఈ వంటకాన్ని ఎంతో ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు.

Also Read: మీ ఆత్మీయుల కోసం రంజాన్‌ స్పెషల్ విషెస్, వాట్సప్ స్టేటస్‌ కొటేషన్లు ఇవిగో!

హైదరాబాదీ హలీమ్ (Hyderabadi Haleem)

Advertisement

రంజాన్ మాసంలో మాత్రమే దొరికే అత్యంత పోషక విలువలున్న వంటకం హలీమ్. గోధుమలు, మాంసం, పప్పు దినుసులు, నెయ్యి, మసాలాలను గంటల తరబడి సన్నని సెగపై ఉడికించి, మెత్తగా రుబ్బి దీనిని తయారు చేస్తారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుని తింటే ఆ మజానే వేరు.

షాహీ తుక్డా (Shahi Tukda)

దీనిని రాయల్ డెజర్ట్ అని కూడా పిలుస్తారు. బ్రెడ్ ముక్కలను నెయ్యిలో దోరగా వేయించి, చక్కెర పాకంలో ముంచి, పైన చిక్కటి రబ్రీ (పాలు మరిగించి చేసిన మిశ్రమం) వేసి దీనిని తయారు చేస్తారు. కుంకుమపువ్వు, యాలకుల పొడి దీనికి రాజసం తెచ్చిపెడతాయి. భోజనం తర్వాత చల్లగా లేదా వేడిగా వడ్డించే ఈ స్వీట్, రంజాన్ విందును పరిపూర్ణం చేస్తుంది.

Also Read: ముస్లిం సోదరులు రంజాన్‌ను ఎందుకంత పవిత్రంగా భావిస్తారు? దీని వెనుకున్న చరిత్ర ఏమిటి?

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×