// // Protein Dosa - ప్రతి ఉదయం ఇలాంటి ప్రొటీన్ దోశ తింటే రోజంతా ఆరోగ్యమే -->
E-Paper
Advertisement

Protein Dosa: ప్రతి ఉదయం ఇలాంటి ప్రొటీన్ దోశ తింటే రోజంతా ఆరోగ్యమే

Protein Dosa: ప్రతి ఉదయం ఇలాంటి ప్రొటీన్ దోశ తింటే రోజంతా ఆరోగ్యమే
Advertisement

బీట్‌రూట్, పనీర్‌తో చేసే హై ప్రోటీన్ దోశ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పుకోవచ్చు. బీట్‌రూట్‌లో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. పనీర్‌లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండింటి కలయికతో చేసే దోశె తిన్నవారికి శక్తి, హిమోగ్లోబిన్ పెరుగుదల, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు అందుతాయి. ఇంట్లో సులభంగా చేసే ఈ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ప్రోటీన్ దోశె రెసిపీకి కావలసిన పదార్థాలు
బీట్‌రూట్ – ఒకటి
పనీర్ – 100 గ్రాములు
శెనగపిండి – ఒక కప్పు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
అల్లం – చిన్న ముక్క
జీలకర్ర – అర స్పూన్
కొత్తిమీర తురుము – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – అవసరమైనంత
నూనె లేదా నెయ్యి – సరిపడినంత

Advertisement

Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో

ప్రోటీన్ దోశె రెసిపీకి కావలసిన పదార్థాలు
1. బీట్‌రూట్ తొక్క తీసి బాగా కడిగి తురమాలి. పనీర్‌ను చేతితో లేదా ఫోర్క్‌తో మెత్తగా చేసి పక్కన పెట్టాలి.

Advertisement

2. ఒక కప్పులో శెనగపిండి వేసి అందులో తురిమిన బీట్‌రూట్, పనీర్ , ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి కలపాలి.

3. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ గడ్డలు లేకుండా బాగా కలపాలి. పిండిని దోశ పిండిలా జారేలా కలుపుకోవాలి.

4. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. కాస్త నూనె వేయాలి. ఒక గరిటె పిండిని తీసుకుని పెనంపై పోసి దోశలా పలుచగా చేసుకోవాలి.

5. ఒక వైపు కాలిన తరువాత దోశెను తిప్పి మరో వైపు కూడా గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే టేస్టీ ప్రొటీన్ దోశ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.

Also read: Green Mirchi Halwa: పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తారు తెలుసా? తింటే అదిరిపోతుంది కూడా

ఇక్కడ చెప్పిన దోశెను తింటే ఎంతో ఆరోగ్యకరం. రెండు దోశెలు తింటే చాలు పొట్ట నిండిపోతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటే సాయంత్రం వరకు చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పిండిని ఒక్కసారి కలుపుకుంటే నాలుగు రోజుల పాటూ ఫ్రిజ్ లో పెట్టి వాడుకోవచ్చు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×