E-Paper
Advertisement

Kobbari Palli Chutney: కొబ్బరి పల్లీ చట్నీ ఇలా చేసి ఇడ్లీ, దోసెతో తింటే అదిరిపోతుంది

Kobbari Palli Chutney: కొబ్బరి పల్లీ చట్నీ ఇలా చేసి ఇడ్లీ, దోసెతో తింటే అదిరిపోతుంది
Advertisement

ఇడ్లీ, దోసె, ఉప్మా, పెసరట్టు వంటి వాటికి పక్కన చట్నీ చాలా ముఖ్యం. అందులో కొబ్బరి పల్లీ చట్నీ చాలా మందికి ఇష్టమైనది. కొబ్బరి,పల్లీలు కలిపడం వల్ల వచ్చే రుచి చట్నీకి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. ముఖ్యంగా ఈ చట్నీని ఇంట్లో తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉదయం త్వరగా టిఫిన్ తయారు చేయాల్సినప్పుడు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది.

కొబ్బరి పల్లీ చట్నీ రెసిపీకి కావలసిన పదార్థాలు
తురిమిన కొబ్బరి – 1 కప్పు
వేయించిన పల్లీలు – అర కప్పు
పచ్చిమిర్చి – అయిదు
వెల్లుల్లి రెబ్బలు – మూడు
చింతపండు – ఉసిరికాయ సైజులో
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – అవసరమైనంత

Advertisement

తాలింపు కోసం
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – అర టీస్పూన్
మినప్పప్పు – అర టీస్పూన్
ఎండుమిర్చి – 1 లేదా 2
కరివేపాకు – గుప్పెడు

Also read: Simple Breakfast: రాత్రి మిగిలిన రోటీలతో ఉదయం టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రోటీ ఉప్మా .. రెసిపీ ఇదిగో

Advertisement

కొబ్బరి పల్లీ చట్నీ రెసిపీ
1. మొదట మిక్సీ జార్ తీసుకుని అందులో తురిమిన కొబ్బరి వేయాలి. తరువాత వేయించిన పల్లీలు వేసుకోవాలి.
2. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు చిన్న ముక్క వేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు వేయాలి.
3. ఇప్పుడు కొద్దిగా నీరు వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి.
4. చట్నీ చాలా పలుచగా కాకుండా మధ్యస్థగా ఉండేలా గ్రైండ్ చేస్తే రుచిగా ఉంటుంది. అవసరమైతే కొద్దిగా నీరు మళ్లీ వేసి మరోసారి తిప్పుకోవచ్చు.
5. గ్రైండ్ చేసిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి.
6. ఒక చిన్న కళాయి తీసుకుని అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి.
7. తరువాత ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
8. ఈ తాలింపును ముందుగా తయారుచేసిన చట్నీ మీద పోసి నెమ్మదిగా కలపాలి. అంతే రుచికరమైన కొబ్బరి పల్లీ చట్నీ సిద్ధం.

Also read: Treasure: ఇంటి పునాది తవ్వుతుండగా బయటపడిన బంగారం.. నిధి మాత్రం కాదు

కొబ్బరి తాజాగా ఉంటే చట్నీ రుచి చాలా బాగుంటుంది. పాత కొబ్బరి వాడితే కొద్దిగా తియ్యటి రుచి తగ్గిపోతుంది. పల్లీలను ఎక్కువగా వేయించకూడదు. ఎక్కువ వేయిస్తే చేదుగా మారే అవకాశం ఉంటుంది. కారం తక్కువగా తినేవారు పచ్చిమిర్చి సంఖ్య తగ్గించుకోవచ్చు. ఎక్కువ కారం ఇష్టపడేవారు మరొకటి రెండు మిర్చీలు అదనంగా వేసుకోవచ్చు. వెల్లుల్లి వేయకపోయినా చట్నీ బాగానే ఉంటుంది. కానీ వెల్లుల్లి వేసితే ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ చట్నీ వేడి వేడి ఇడ్లీ, దోసె, ఉత్తప్పం, పెసరట్టు, ఉప్మాతో చాలా రుచిగా ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×