// // Coconut Chocolate Balls: పిల్లల కోసం హెల్దీ కోకోనట్ చాక్లెట్ లడ్డూ.. -->
E-Paper
Advertisement

Coconut Chocolate Balls: పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీ కోకోనట్ చాక్లెట్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

Coconut Chocolate Balls: పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీ కోకోనట్ చాక్లెట్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
Advertisement

Coconut Chocolate Balls: స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందులోనూ చాక్లెట్-కొబ్బరి కాంబినేషన్ అంటే ఆ రుచే వేరు. బయట బేకరీల్లో దొరికే రకరకాల చాక్లెట్లను చూసినప్పుడు ఈ విధానంలో ఇంట్లోనే తయారు చేసుకోలేమా? అని చాలామందికి అనిపిస్తుంది. నిజానికి.. ఎలాంటి పాకం పట్టే పని లేకుండా.. గంటల తరబడి కష్టపడకుండా కేవలం 15 నిమిషాల్లో అద్భుతమైన ‘కోకోనట్ చాక్లెట్ బాల్స్’ తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం ఇప్పుడు..

కావాల్సిన పదార్థాలు:

ముందుగా ఒక కప్పు కొబ్బరి తురుము సిద్ధం చేసుకోండి. దాంతో పాటు ఒక కప్పు కండెన్స్‌డ్ మిల్క్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఒక స్పూన్ వెన్న, కొద్దిగా వెనీలా ఎసెన్స్ దగ్గర పెట్టుకోండి. ఇక చాక్లెట్ రుచిని మరింత పెంచడానికి రెండున్నర టేబుల్ స్పూన్ల డార్క్ చాక్లెట్ చిప్స్, గార్నిష్ కోసం ఒక మూడు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఉంటే సరిపోతుంది.

Advertisement

Also Read: తియ్యని సపోటాతో బోలెడన్ని లాభాలు.. కానీ ఆ వ్యాధి ఉన్నవారు మాత్రం అస్సలు తినకూడదు!

తయారీ ఇలా..

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, అందులో వెన్న వేయండి. వెన్న కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి, మంచి వాసన వచ్చే వరకు రెండు నిమిషాల పాటు దోరగా వేయించాలి. కొబ్బరి కాస్త వేగాక, అందులో కండెన్స్‌డ్ మిల్క్, కోకో పౌడర్ మరియు వెనీలా ఎసెన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుతూ ఉండాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని దగ్గరుండి కలుపుతుంటే, కాసేపటికి అది చిక్కబడి పాన్ నుంచి విడిపోతూ ఒక ముద్దలా తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి, ఆ వేడి మిశ్రమంలోనే డార్క్ చాక్లెట్ చిప్స్ వేసి కలపాలి. ఆ వేడికి చాక్లెట్ చిప్స్ కరిగి మిశ్రమానికి మంచి రంగును, టెక్స్చర్‌ని ఇస్తాయి.

మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత లడ్డూలా చుట్టుకోవాలి. తర్వాత ఆ బాల్స్‌ను విడిగా ఉన్న కొబ్బరి పొడిలో దొర్లిస్తే, అవి చూడటానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తాయి. చివరగా వీటిని ఒక అరగంట పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే అవే గట్టిపడతాయి.

Also Read: నోరూరించే చింతచిగురు పచ్చి రొయ్యల ఇగురు.. ఇలా వండితే ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోతారు!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×