E-Paper
Advertisement

జగనన్న టెక్‌ఫోర్స్.. సోషల్ మీడియాపై వైసీపీ నయా ప్లాన్

జగనన్న టెక్‌ఫోర్స్.. సోషల్ మీడియాపై వైసీపీ నయా ప్లాన్
Advertisement

Ysrcp Tech Force: తమిళనాడు ఎన్నికల చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాలు అలర్టయ్యాయి. అన్నింటి కంటే ముందు ఏపీ విషయానికి వద్దాం. కేవలం సోషల్ మీడియా వల్ల విజయ్ సక్సెస్ అయ్యాడని ఇక్కడి నేతలు బలంగా నమ్ముతున్నారు. డీఎంకె ప్రభుత్వం టీవీకే పార్టీ చేసిన ప్రచారం, సోషల్ మీడియా వల్ల ఇది సాధ్యమైందని నమ్ముతున్నారు. ఈ విషయంలో వైసీపీ వేగంగా అడుగులు వేస్తోంది.

సోషల్ మీడియాపై వైసీపీ నయా ప్లాన్

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను వైసీపీ అధినేత జగన్ అలర్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాను మరింత బలంగా చేయాలని ఆలోచన చేస్తున్నారు. నాయకులపై ఆధారపడకుండా కేడర్‌తో అధినేత జగన్ నేరుగా మాట్లాడేలా ప్లాన్ చేస్తోంది. క్యాడర్‌తో అధినేత అనుసంధానం అయ్యేలా డిజిటల్ వ్యవస్థను రూపొందిస్తోంది.

కేడర్ డేటాను వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికే సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వెరిఫికేషన్ జరుగుతోంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? నేతలకు కార్యకర్తలకు ఏమైనా గ్యాప్ ఉందా? ఏయే నియోజకవర్గాల్లో కేడర్ యాక్టివ్‌గా పని చేస్తోంది? వీటికి సమాధానం లభించేలా వ్యవస్థను సిద్ధం చేస్తోంది. అన్ని నియోజకవర్గాల నుంచి డేటా పార్టీ ఆఫీసుకు చేరేలా వ్యవస్థను రెడీ చేస్తోంది.

Advertisement

కలెక్టర్ల సమావేశంలో అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

దీనికితోడు ఓటర్లను ప్రభావితం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ నుంచి కొన్ని ఫీలర్లు బయటకు వచ్చింది. ప్రతీ నియోజకవర్గానికి ఇన్‌ఫ్లుయెన్సర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం అమరావతి వేదికగా కలెక్టర్లు సమావేశం జరుగుతోంది. అందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాచార పౌర సంబంధాల శాఖపై ఆయన కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ అండ్ పీఆర్ వ్యవస్థ సరిగా పని చేయలేదని తేల్చేశారు. కేవలం ఓ ఆభరణంలా తయారైందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా సోషల్ మీడియా ఎందుకు ఉపయోగించు కోవడం లేదని ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఇన్‌ఫ్లూయెన్సర్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

ALSO READ: త‌మిళనాట‌ బీజేపీ పిల్లి చెల‌గాటం రాజ‌కీయాలు! న‌వ్వుల పాలు..అయినా మార‌ని పంతం!

స్థానికంగా ఉండే ఇన్‌ఫ్లూయెన్సర్ల సహాయంతో ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలని ఆ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ లెక్కన సోషల్ మీడియాలో ఎంత ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్లు మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ఇదే ఫార్ములాను అవలంభించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీలోని అధికార పార్టీయే కాదు.. చివరకు విపక్ష వైసీపీ కూడా దీనిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఎన్నికలు నేతల ప్రచారాల చుట్టూ తిరిగేవి. ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాయన్నమాట.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×