E-Paper
Advertisement

Amaravati: షర్మిలాను అలా పిలవలేదు.. అందుకే దాసీ అన్నాను, టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు

Amaravati: షర్మిలాను అలా పిలవలేదు.. అందుకే దాసీ అన్నాను, టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు
Advertisement

Amaravati: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కారణాలు ఏంటో తెలీదుగానీ, వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. ఈ విషయంలో పదే పదే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినా కొందరు నేతలు ఏమాత్రం మారలేదు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నేత కాసు చేసిన కామెంట్స్ వ్యవహారం ముదిరిపాకాన పడింది.

టీడీపీపై వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు

Advertisement

ఏప్రిల్ 16 నుంచి 18 పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. కీలకమైన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ఆ సమావేశాల్లో చర్చ జరిగింది. పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌పై నోరు విప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి.

మహిళా బిల్లుకు తాము మద్దతు ఇస్తామని, డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెరుగుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే మెరుగైందని భావించి సపోర్టు చేశామన్నారు. దానికి మోదీ చెప్పినట్టు జగన్ చేస్తున్నట్లుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడడంపై మండిపడ్డారు.

Advertisement

షర్మిలాను అలా పిలవలేదు.. అందుకే అలా అన్నాను-కాసు

అసలు షర్మిల చట్టం చదివారా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలా షర్మిల తయారయ్యారని వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి. టీడీపీ తధానా అంటే ఆమె దానికి వంత పాడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కాసు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గమనించిన కాసు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను దాసి అంటే మరొక విధంగా అన్నట్టు చిత్రీకరించారంటూ టీడీపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాసు మహేష్ రెడ్డి. దాసి అంటే వే* కాదన్నారు. సర్వెంట్ అంటే పని మనిషి అనే అర్ధం వస్తుందన్నారు. తమ నాయకుడు జగన్‌‌ని ఉద్దేశించి షర్మిల బానిస అనడంవల్లే తాను దాసి అన్నానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాసు ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ALSO READ:  జగిత్యాలలో కేసీఆర్.. ఢిల్లీకి హరీశ్ రావు.. ఏం జరుగుతోంది?

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×