E-Paper
Advertisement

ఒరిజిన‌ల్ ఎవ‌రు? న‌కిలీ ఎవ‌రు? జ‌నం క‌దా డిసైడ్ చేయాల్సింది కేటీఆర్‌! ఇంకా అదే అహంకారమా??

ఒరిజిన‌ల్ ఎవ‌రు? న‌కిలీ ఎవ‌రు? జ‌నం క‌దా డిసైడ్ చేయాల్సింది కేటీఆర్‌! ఇంకా అదే అహంకారమా??
Advertisement

టీఆరెస్ పేరును క‌విత ప్ర‌క‌టించ‌గానే మొద‌టగా కేటీఆర్‌, కేసీఆర్ గుండెలు గుభేల్‌మ‌న్నాయి. మెయిన్ పాయింట్ మీదే దెబ్బ‌కొట్టిందిరా! అని అనుకుని ఉంటారు. వెంట‌నే తేరుకున్నారు. ఈ న‌ష్ట నివార‌ణ ఎలా ఎలా అని నెత్తి కొట్టుకున్నారు. వెంట‌నే త‌న పెయిడ్ బ్యాచ్‌ను రంగంలోకి దింపారు. మేమే ఒరిజిన‌ల్‌.. మీరే న‌కిలీ.. అని సోష‌ల్ మీడియాలో ఓ వార్త‌ను ప్రచారం చేశారు. ఏదో సినిమాలో వేణుమాధ‌వ్ ఏం చేద్దామ‌నుకున్నా ఉల్టా దెబ్బులు తిని బాడీలో ఏదో ఒక పార్టుకు క‌ట్టు క‌ట్టుకుని క‌నిపిస్తాడు. కొంద‌రి జాత‌క‌మంతే. ఇక్క‌డా కేటీఆర్ చీప్ స్ట్రాట‌జీ బెడిసికొట్టింది.

టీఆరెస్‌ను వ‌ద‌లుకున్న‌దెవ‌రు? ఇప్పుడు అది మాదే మాదే.. మేమే దానికి ఓన‌ర్ల‌మ‌ని ప్ర‌క‌టించుకోవ‌డెందుకు? కేటీఆర్ ఈ మ‌ధ్య మీడియాతో చిట్ చాట్‌లో అన్నాడు.. మేం చాలా త‌ప్పులు చేశాం.. ఆ త‌ప్పుల్లో ఒక‌టి పార్టీ పేరును మార్చ‌డ‌మ‌ని. త్వ‌ర‌లో త‌మ పార్టీ పేరును బీఆరెస్ నుంచి టీఆరెస్‌గా మారుస్తామ‌న్నాడు. అదీ కవిత ఎఫెక్టే. కానీ అది నిజంగా కేటీఆర్‌లో వ‌చ్చిన ప‌రివ‌ర్త‌న కాదు. అదో నాట‌కం. క‌విత.. టీఆరెస్ పేరును తీసుకోవ‌ద్ద‌నే. అక్క‌డ కేసీఆర్ మాటే చెల్లుబాటు. త‌ను ఒక‌సారి డిసైడ్ అయ్యాడా..? ఎవ‌డి అబ్బ‌కూ విన‌డు. ఇక కొడుకు మాట వింటాడా? అది కేటీఆర్‌కూ తెలుసు.

Advertisement

కానీ రాజ‌కీయాల‌ను సైడ్ ట్రాక్ ప‌ట్టించ‌డ‌మే కోస‌మే. నిజంగా కేసీఆర్‌లో ప‌శ్చాత్తాపం ఉందా..? ప‌ర్టికుల‌ర్‌గా పార్టీ పేరును మార్చాన‌ని. అస్స‌లు లేదు. త‌ను చేసింది క‌రెక్టేనంటాడు ఆయ‌న ఇప్ప‌టికీ. పాపం.. కొడుకు కోసం ఆనాడు తంటాలు ప‌డ్డాడు. ఇక్క‌డ తెలంగాణ పిచ్చి జ‌నం నేను ఏది చెబితే అది వింటారు.. ఇక కొడుకుకు సీఎం ప‌ద‌వి ఇచ్చేసి.. తాను జాతీయ రాజ‌కీయాల్లో ఓ చ‌క్రం గిరా గిరా తిప్పి.. ఢిల్లీలో సేద తీరొచ్చున‌ని క‌ల‌లు క‌న్నాడు. ఇదీ ఆయ‌న రాజ‌కీయ చతుర‌త‌. ఇంట గెలిచి ర‌చ్చ గెలవాలి.. కానీ ఇంట‌నే ఇంకా గెల‌వ‌లే. ఇంక ఢిల్లీ ప‌య‌న‌మెందుకు కాక‌? అని ఎంత మంది మొత్తుకున్నా.. విన‌లే. ఇక్క‌డి పైస‌లు ఎక్క‌డెక్క‌డో పంచాడు. మ‌రి జ‌నం క‌డుపు మండదా?

మీ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం పార్టీ పేరును మార్చి.. ఇప్పుడు అది మాదే ఒరిజిన‌ల్ మేమే.. మీరే ఫేకు.. న‌కిలీ అని నిందించ‌డం ఎందుకు? నిజంగా మీరు ప‌రివ‌ర్త‌న చెందితే ఓడిన వెంట‌నే మీరు బీఆరెస్‌ను టీఆరెస్‌గా మార్చేదుందే. అది చ‌చ్చినా కేసీఆర్ చేయ‌డు. ఎందుకంటే. ఆయ‌నంతే. త‌ను మెట్టు దిగ‌డు. దిగితే నామోషీ. త‌ల తీసేసినంత‌గా బాధ‌ప‌డ‌తాడు. అంత‌టి నియంత ఆలోచ‌న‌లు కేసీఆర్‌కు ఉన్నాయి కాబ‌ట్టే.. కవిత .. తండ్రి నుంచి ఈ పాఠాలు నేర్చుకుని జ‌నం ఏది మిస్స‌య్యారో… అదే పేరుతో అంద‌రినీ క‌లిసేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆమెను త‌ప్పుబ‌ట్ట‌డ‌మెందుకు? మీకు చేత‌గాక‌.. గుమ్మ‌డి కాయ‌ల దొంగ‌ల్లా భుజాలు త‌డుముకోవ‌డ‌మెందుకు? ఇది క‌దా మీకు మీరే సెల్ఫ్‌గోల్ కావ‌డం. ఇలాంటివి ఇంకా ఇంకా చేస్తూ పోండి. క‌విత‌ను , ఆమె కొత్త పార్టీ టీఆరెస్‌ను బ‌లోపేతం చేయ‌డానికి.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×