E-Paper
Advertisement

2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!

2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!
Advertisement

ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజ‌కీయాల్లో దుమారం రేసాయి. గ‌తంలో కూడా ఆయ‌న ఇలాంటి కామెంట్స్ చేసినా తాజా కామెంట్‌లో ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు.. జాతీయ రాజ‌కీయాల ఇంట్ర‌స్టు క‌ల‌గ‌లిపి చెప్పిన వివ‌రాలు డిస్క‌ష‌న్‌కు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో బీఆరెస్‌, బీజేపీల‌ను తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేశాయి. అస‌లాయ‌నేమ‌న్నాడు? అన్నీ పార్టీల‌కు తెలంగాణ‌లో రెండేసి సార్లు ప్ర‌జ‌లు అధికారం ఇస్తూ వ‌స్తున్నారు. ఈ లెక్క‌న ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా మ‌రోట‌ర్ము అధికారం ఇవ్వ‌డం ఖాయం.. మ‌ళ్లీ నేనే సీఎం అవ్వ‌డ‌మూ ఖాయ‌మ‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఇక్క‌డ రెండు విష‌యాలు .. కాంగ్రెస్ పార్టీలో కూడా డిస్క‌ష‌న్‌కు వ‌చ్చాయి.

ఎలాగోలా మ‌ళ్లీ జ‌నామోదంతో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం నా భుజాల‌పైనే ఉంది. దీన్నిక‌చ్చితంగా చేరుతాను.. అని చెప్ప‌డ‌మే కాదు.. ఇండైరెక్టుగా మ‌ళ్లీ త‌నే సీఎం అని త‌న పార్టీ నేత‌ల‌కే సూత్ర‌ప్రాయంగా చెప్పేయ‌డం. అధిష్టానం ఆశీస్సులు లేనిది.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటగానే .. రేవంత్ చెప్పిన రెండోసారి సీఎం.. అనే ప్ర‌క‌ట‌నే అనుకోవాలి. జాతీయ పార్టీలో మ‌ళ్లీ నేనే సీఎం.. అని ముందే చెప్పుకునే సంప్ర‌దాయం లేదు. అందులోనూ కాంగ్రెస్‌లో ఇలా చెబితే వెంట‌నే రెబ‌ల్స్ వార్ మొద‌ల‌వుతుంది. ఇక్క‌డ జ‌రిగింది మొద‌ట్లో. కానీ ఇప్పుడు అంతా సైలెంట్‌గా ఉన్నారు. త‌త్వం బోధ‌ప‌డిందా? అసంతృప్తులంద‌రినీ రేవంత్ బుజ్జ‌గించారా? అధిష్టానం మ‌దిలో ఏం ఉందో అంతా అర్థం చేసుకున్నారా? ఏమిటో తెలియ‌దు కానీ రాష్ట్ర కాంగ్రెస్‌లో మ‌ళ్లీ నేనే సీఎం.. అనే అంశంపై డిస్క‌ష‌న్ బ‌య‌ట‌కైతే రాలేదు.

Advertisement

వాస్త‌వానికి సీఎం రేసులో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు, సీనియ‌ర్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే… సీఎం సీటునే గుంజేసుకుంటా… అనే దాకా పోయింది. ఆ పార్టీలో నేత‌ల స్వాతంత్రం అట్లా ఉంటుంది మ‌రి. కానీ ఈ ద‌ఫా.. అంతా సైలెంట్ అయ్యారు. ఎక్క‌డా చ‌ప్పుడు లేదు. కానీ బీజేపీ నుంచి అర్వింద్ బ‌య‌లుదేరాడు… రేవంత్ మ‌ళ్లీ మేమే అన‌గానే.. మ‌రి మేమేం చేయాలె.. చూస్తూ కూర్చోవాలా? అని అనుకున్నాడేమోగానీ, బాగా క‌డుపు రగిలిన‌ట్టుంది. ప్రెస్‌మీట్ పెట్టి. 2034 దాకా కాదు.. 2029లోనే కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతుంది.. అని జోస్యం చెప్పాడు. రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టి.. బ‌ల‌హీన ప‌రిచేందుకు మొన్న‌టిదాకా ఏక్‌నాథ్ షిండే పేరును విరివిగా వాడేవారు బీజేపీ నేత‌లు.

ఇప్పుడు అర్వింద్ నోటి నుంచి ప‌శ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పేరు తీశాడు. రేవంత్ కూడా సువేందు లా మారుతాడేమోన‌ని.. ప‌రోక్షంగా త‌మ పార్టీలోకి రేవంత్ వ‌స్తార‌ని అన్నాడు. మొన్న మోడీ కూడా వేదిక మీద ఇదే మాట‌న్నాడు. క‌లిసి ప‌నిచేసుకుంటే.. నిధులే నిధులు కదా…! రావొచ్చు క‌దా అని బ‌హిరంగంగానే ఆహ్వానించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదంతా పొలిటిక‌ల్ స్ట్రాట‌జీలో భాగ‌మే. దీనిపై సీఎంను కూడా ప‌లు మీడియా సంస్థ‌లు గుచ్చి గుచ్చి అడిగాయి? మీరు బీజేపీలోకి వెళ్తారా? స్వ‌యంగా మోడీ ఆహ్వానించాడు క‌దా? అని. మోడీ ఉద్దేశం కూడా ఇదే. కానీ, దీన్ని రేవంత్ స‌మ‌య‌స్పూర్తిని ప్ర‌ద‌ర్శించి త‌న‌దైన శైలిలో దీనికి ఆన్సర్ ఇచ్చాడు. ఏమ‌న్నాడు? నా డిమాండ్ అట్ల ఉంది మ‌రి మార్కెట్లో.. న‌న్ను పార్టీలోకి మ‌రీ మ‌రీ ఆహ్వానిస్తున్నారు? అని వారి ఎత్తుకు పై ఎత్తుగా త‌ను పొలిటిక‌ల్‌గా కామెంట్ చేశారు.

Advertisement

అర్వింద్ కూడా.. కాంగ్రెస్‌లో లుక‌లుక‌లు రావాల‌నే కోరిక‌తో సీఎం.. మా పార్టీలోకి వ‌చ్చే వ్య‌క్తేన‌నే ఊహాగానాల మాట‌లు చెబుతూ వ‌చ్చాడు. ఇక ఇది స‌రిపోదంటూ.. కాంగ్రెస్‌లో సీనియ‌ర్లకు సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని కూడా ఆకాంక్షించాడు. అదేందీ? పార్టీ అధికారంలోకి రాదంటాడు..? సీనియ‌ర్ల‌కు సీఎం చాన్స్ ఇవ్వాలంటాడు..? త‌న‌కే క్లారిటీ మిస్స‌య్యింది.. ! ఇక బీఆరెస్ కూడా రేవంత్ కామెంట్‌ను త‌ట్టుకోలేక‌పోతున్న‌ది. ఇప్పుడున్న‌ది ఒరిజిన‌ల్ కాంగ్రెస్ కాద‌ని బీఆరెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గుంత‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి ఇవాళ కామెంట్ చేశారు. అక్క‌డున్న వారంతా బీఆరెస్‌లోకి వ‌స్తార‌ని జోస్యం చెప్పాడు. ఇక‌పై ఈ దాడి మ‌రింత ముమ్మ‌ర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతానికైతే సొంత పార్టీలో లుక‌లుక‌లు రాక‌పోవ‌డం, రెబెల్ కామెంట్స్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం కూడా చ‌ర్చ‌కు వస్తున్న అంశంగా ఉంది.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×